మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు సునీల్ గవాస్కర్, ఇయాన్ బిషప్, హర్షా బోగ్లే వంటి వారిని ఎంపిక చేసిన ఐపీఎల్ కమిటీ, సంజయ్ మంజ్రేకర్‌ని మాత్రం సెలక్ట్ చేయలేదు.

తెలుగులో మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యతగా వ్యవహారించబోతున్నారు. ఎమ్మెస్కేతో పాటు వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు, కళ్యాణ కృష్ణ, ఎం. ఆనంద్ శ్రీ కృష్ణ, నేహా మాచ, కౌశిక్ చక్రవర్తి, ఆశీష్ రెడ్డి కామెంటేటర్లుగా వ్యవహారిస్తారు. తమిళ్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యతగా వ్యవహారించబోతున్నారు.


ఇంగ్లీషులో సునీల్ గవాస్కర్, రోహన్ గవాస్కర్, దీప్ దస్‌గుప్తా, శివరామకృష్ణన్, హార్షా బోగ్లే, పీటర్సన్, డుమినీ, మురళీ కార్తీక్, హిందీలో సంజయ్ భంగర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.