Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు విరాట్ కోహ్లీకి ఊరట: పంజాబ్ పై బెంగళూరు విజయం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించారు.

IPL 2019: RCB defeats Kings XI Punjab
Author
Mohali, First Published Apr 14, 2019, 7:43 AM IST

మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపిఎల్) సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎట్టకేలకు ఊరట లభించింది. వరుస అపజయాలతో ఢీలా పడిన బెంగళూరు జట్టు చివరకు ఓ విజయాన్ని అందుకుంది ఐఎస్‌ బృందా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాన్ని అందుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కోహ్లీ, పార్థీవ్‌లు కలిసి తొలి వికెట్‌కి 43 పరుగులు జోడించారు. అయితే అశ్విన్ వేసిన 4వ ఓవర్ ఐదో బంతికి పార్థీవ్(19) మయాంక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. 

ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన డివిలియర్స్‌తో కలిసి కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 85 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే కోహ్లీ అర్థ శతకం సాధించాడు.
అయితే షమీ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి కోహ్లీ(67) భారీ షాట్‌కు ప్రయత్నించి మురగన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడ. 

డివిలియర్ నిలకడగా ఆడి 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 59 పరుగులు చేశాడు. స్టోనిస్‌ మాత్రం చెలరేగిపోయాడు. 16 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. దీంతో బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios