Asianet News TeluguAsianet News Telugu

అజేయ హాఫ్ సెంచరీతో డిల్లీని గెలిపించిన పంత్... రాజస్థాన్‌ ప్లేఆఫ్ ఆశలు గల్లంతు

ఐపిఎల్ సీజన్ 12 ను డిల్లీ క్యాపిటల్స్ మరో సూపర్ విక్టరీతో ముగించింది. మొదట బౌలింగ్ లో ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రాల మాయాజాలం...బ్యాటింగ్ లోొ రిషబ్ పంత్ అజేయ హాఫ్ సెంచరీ డిల్లీని విజయతీరాలకు చేర్చాయి. ఈ విజయంతో డిల్లీ పాయింట్స్ టేబుల్ లో రెండోస్థానానికి వెళ్లింది. 

ipl 2019: delhi capitals vs rajasthan royal match updates
Author
New Delhi, First Published May 4, 2019, 4:07 PM IST

ఐపిఎల్ సీజన్ 12 ను డిల్లీ క్యాపిటల్స్ మరో సూపర్ విక్టరీతో ముగించింది. మొదట బౌలింగ్ లో ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రాల మాయాజాలం...బ్యాటింగ్ లోొ రిషబ్ పంత్ అజేయ హాఫ్ సెంచరీ డిల్లీని విజయతీరాలకు చేర్చాయి. ఈ విజయంతో డిల్లీ పాయింట్స్ టేబుల్ లో రెండోస్థానానికి వెళ్లింది. 

ఇక ఈ ఓటమితో రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశలు గల్లతయ్యాయి . దీంతో ఆ జట్టు ఈ ఐపిఎల్ సీజన్లో చివరి మ్యాచ్ కూడా ముగించినట్లయింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించలేకపోయిన రాజస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. 

116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డిల్లీ ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రిషబ్ పంత్ ఒక్కడే 38 బంతుల్లో 53 పరుగులు చేయగా మిగతావారెవరూ కనీసం 20 పరుగులను కూడా చేయలేకపోయారు. అయితే లక్ష్యం చాలా చిన్నది కావడంతో వారు చేసిన బొటాబోటి పరుగులే డిల్లీ విజయానికి ఉపయోగపడ్డాయి. 

రాజస్థాన్ బౌలర్ సోది తన మొదటి ఓవర్ మొదటి రెండు బంతుల్లోనే అద్భుతం చేశాడు. దాటిగా ఆడుతున్న డిల్లీ ఓపెనర్లు శిఖర్ ధావన్(16 పరుగులు), పృథ్విషా(8 పరుగులు) లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. అయితే సోది హ్యాట్రిక్ అవకాశాన్ని శ్రేయాస్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్రామ్ వికెట్ ను కూడా పడగొట్టిన సోధి మొత్తంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గత మ్యాచ్ హ్యాట్రిక్ వీరుడు గోపాల్ ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టాడు.  

ఆరంభంలో ఇషాంత్, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ అమిత్ మిశ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. వీరిద్దరు కలిసి చెరో మూడు వికెట్లు, బౌల్ట్ చివర్లో రెండు వికెట్లు పడగొట్టి రాయల్స్ ను దెబ్బతీశారు. అయితే రాజస్థాన్ బ్యాట్ మెన్ రియాన్ పరాగ్ ఒక్కడే ఒంటరిపోరాటం చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. లేకుంటే రాజస్థాన్ ఈమాత్రం స్కోరును కూడా సాధించలేకపోయేది. రాయల్స్ జట్టులో పరాగ్, లివింగ్ స్టోన్, గోపాల్ తప్ప మిగతావారెవ్వరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 

  ఐపిఎల్ సీజన్ 12 లో మరో రసవత్తరమైన మ్యాచ్ కు డిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం సిద్దమయ్యింది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా వుంచుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన చివరి మ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు డిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. రాజస్థాన్ కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కాగా డిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్ కు చేరుకున్నా పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ సాధించాలంటే ఈ మ్యాచ్ లో గెలిచితీరాలి. ఇలా ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలిచి తమ అవకాశాలన మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాయి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ అజింక్యా రహానే ముందుగా బ్యాటింగ్‌ వైపే మొగ్గుచూపాడు. స్మిత్ జట్టుకు దూరమవడంతో అతడి స్థానంలో సోదీ జట్టులో చేరాడు. అలాగే ఉనద్కత్ స్థానంలో కె గౌతమ్ ను జట్టులోకి  తీసుకున్నట్లు రహానే వెల్లడించాడు. 

డిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ...తాము ప్రతి మ్యాచ్ ను నాకౌట్ లాగే భావించి ఆడాలనుకుంటున్నామని అన్నాడు. సుచిత్, మొరిస్ స్థానంలో కీమో, ఇషాంత్ జట్టులో చేరినట్లు అయ్యార్ వెల్లడించాడు. 

రాజస్థాన్ టీం: 

సంజు శాంసన్, లియమ్ లివింగ్ స్టోన్, అజింక్య రహానే, రియాన్ పరాగ్, స్టువర్ట్ బిన్ని, మహిపాల్ లిమ్రోర్, క్రిష్ణప్ప గౌతమ్, శ్రేయాస్ గోపాల్, ఇశ్ సొథి, వరుణ్ ఆరోన్, థామస్

డిల్లీ టీం:

పృథ్వి షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, ఇంగ్రామ్, రూథర్ ఫర్డ్ , కీమో పాల్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, ట్రెంట్ బోల్ట్ 

 

Follow Us:
Download App:
  • android
  • ios