అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా సామాన్యులతో పాటు ప్రముఖులు  యోగాసనాలు వేశారు. ఈ క్రమంలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వేసిన ఓ ఆసనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మోకాళ్ల కిందకు తన చేతులు పెట్టి కేవలం పాదాల సాయంతోనే హాల్ ఆవరణలో నడవటం ప్రారంభించాడు. పాపం వీరూ దానిని చేయడానికి ఎంత కష్టపడ్డాడో ఏమో కాని వెంటనే ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

‘‘ఖచ్చితంగా ఇది యోగాసనం అని చెప్పలేను కానీ దానికి కొంత సమయం పడుతుందని’’ క్యాప్షన్ పెట్టాడు. ఈ వెంటనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘‘ నువ్వు చేసిన ఆసనం పేరేంటో తెలియదు కానీ నువ్వు  చాలా కష్టపడ్డావు’’ , నీ కష్టానికి ఇవే మా జోహార్లు అంటూ నెటిజన్లు  కామెంట్లు పెడుతున్నారు.