Asianet News TeluguAsianet News Telugu

INDvsSL 3rd T20I: టాస్ గెలిచిన హార్ధిక్ పాండ్యా... సిరీస్‌ డిసైడర్‌గా ఆఖరి టీ20...

India vs Sri Lanka 3rd T20I: మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హార్ధిక్ పాండ్యా... సిరీస్ డిసైడర్‌గా మారిన మూడో టీ20... 

INDvsSL 3rd T20I:  Team India captain hardik Pandya won the toss and elected to bat first
Author
First Published Jan 7, 2023, 6:42 PM IST

శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించడంతో మూడో టీ20 డిసైడర్‌గా మారింది. శ్రీలంకపై స్వదేశంలో వరుసగా 12 టీ20 విజయాలు అందుకున్న టీమిండియాకి గత మ్యాచ్‌లో షాక్ ఎదురైంది. తిరిగి విజయాల ట్రాక్‌లోకి ఎక్కాలని భావిస్తోంది భారత జట్టు.. 

మొదటి టీ20లో 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న భారత జట్టు, రెండో టీ20లో 16 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచుల్లోనూ టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. శుబ్‌మన్ గిల్ రెండు టీ20ల్లో సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయాడు.

గత మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రాహుల్ త్రిపాఠి, మొదటి మ్యాచ్‌లో పెద్దగా మెప్పించలేకపోయాడు. దాదాపు ఆరు నెలలుగా ఆరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్న రాహుల్ త్రిపాఠి, రెండో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిందే...

సంజూ శాంసన్, రిషబ్ పంత్ కోలుకుంటే విరాట్ కోహ్లీ టీ20ల్లో రీఎంట్రీ ఇస్తే రాహుల్ త్రిపాఠి మళ్లీ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. కాబట్టి అతను నేటి మ్యాచ్‌లో ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడనేది తన భవిష్యత్తును డిసైడ్ చేయనుంది...

యంగ్ బౌలర్ శివమ్ మావి అటు బాల్‌తోనే కాకుండా బ్యాటుతోనూ మెరుపులు మెరిపించగలనని నిరూపించుకున్నాడు. తొలి మ్యాచ్‌లో హర్షల్ పటేల్, రెండో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించారు. రెండో టీ20లో  అర్ష్‌దీప్ సింగ్ ఏకంగా 5 నో బాల్స్ వేసి, టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా మిగిలాడు...

హార్ధిక్ పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్ బ్యాటు నుంచి ఓ భారీ ఇన్నింగ్స్‌ రావాల్సి ఉంది. సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా మెప్పించలేకపోయాడు. రెండు మ్యాచుల్లో కలిపి ఒకే వికెట్ తీసిన యజ్వేంద్ర చాహాల్, రవి భిష్ణోయ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు... దీంతో చాహాల్‌కి ఈ మ్యాచ్ కీలకం కానుంది...

శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, కుశాల్ మెండీస్, అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంక, దసున్ శనక, వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుశంక

భారత జట్టు: ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్ 

Follow Us:
Download App:
  • android
  • ios