Asianet News TeluguAsianet News Telugu

INDvsSA 2nd ODI: రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ... కెఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్...

సౌతాఫ్రికాతో రెండో వన్డే: 29 పరుగులు చేసి అవుటైన శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ డకౌట్... హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్...

INDvsSA 2nd ODI: Rishabh Pant half century, Virat goes for duck, KL Rahul captain
Author
India, First Published Jan 21, 2022, 4:00 PM IST

తొలి వన్డేలో ఓటమి తర్వాత టీమిండియా గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటి వన్డేలో స్వల్ప స్కోరుకే అవుటై, తీవ్రంగా నిరాశపరిచిన వికెట్ కీపర్ రిషబ్ పంత్... కీలకమైన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, 25 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ కలిసి టీమిండియాకి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 38 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు...

శిఖర్ ధావన్ అవుటైన తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 5 బంతులాడిన విరాట్ కోహ్లీ, కేశవ్ మహరాజ్ బౌలింగ్ సఫారీ కెప్టెన్ భవుమాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొదటి వన్డేలో కూడా విరాట్ కోహ్లీ ఇదే విధంగా అవుట్ కావడం విశేషం...

64 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 46 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు రిషబ్ పంత్... కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ కలిసి మూడో వికెట్‌కి 97 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

రిషబ్ పంత్‌కి వన్డేల్లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. గత మ్యాచ్‌లో టూ డౌన్‌లో వచ్చి ఫెయిలైన తర్వాత కూడా రిషబ్ పంత్‌ని అదే స్థానంలో పంపించింది టీమిండియా... 

మరోవైపు కెప్టెన్ కెఎల్ రాహుల్, క్రీజులో కుదురుకుపోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. 71 బంతులు ఆడిన కెఎల్ రాహుల్ 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు... 

పరుగులు చేయడంతో సచిన్ టెండూల్కర్‌తో పోటీ పడుతున్న విరాట్ కోహ్లీ, డకౌట్ల రికార్డులోనూ ‘మాస్టర్’ రికార్డుకి చేరువయ్యాడు. అత్యధిక సార్లు డకౌట్ అయినా టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మెన్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ...

మాజీ ఓపెనర్ సచిన్ టెండూల్కర్ 34 సార్లు డకౌట్ కాగా, మరో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 31 సార్లు డకౌట్ అయ్యాడు. మాజీ వన్ డౌన్ బ్యాట్స్‌మెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 29 సార్లు డకౌట్ అయ్యాడు... విరాట్ కోహ్లీకి ఇది 31వ డకౌట్. సెహ్వాగ్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ, 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ కొనసాగించిన సచిన్ టెండూల్కర్ రికార్డుకు చేరువలో ఉన్నాడు.

వన్డేల్లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడం ఐదేళ్లల్లో ఇది మూడోసారి. ఇంతకు ముందు 2017లో చెన్నైలో ఆస్ట్రేలియాపై, ఆ తర్వాత 2019లో వెస్టిండీస్‌పై విశాఖపట్నంలో జరిగిన వన్డే మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. సౌతాఫ్రికాలో విరాట్ కోహ్లీకి ఇది రెండో డకౌట్ కావడం విశేషం... 2019 నుంచి విరాట్ కోహ్లీకి ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో 9వ డకౌట్ కావడం మరో విశేషం...

 

Follow Us:
Download App:
  • android
  • ios