Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 3rd T20I: రోహిత్ శర్మ హ్యాట్రిక్... మూడో మ్యాచ్‌లో రూట్ మార్చిన హిట్‌మ్యాన్...

India vs New Zealand: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన రోహిత్ శర్మ... యజ్వేంద్ర చాహాల్‌కి చోటు, ఆవేశ్ ఖాన్‌కి దక్కని అవకాశం...

INDvsNZ 3rd T20I: Rohit Sharma won the toss and elected to bat first
Author
India, First Published Nov 21, 2021, 6:35 PM IST

టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. వరుసగా మూడో టీ20 మ్యాచ్‌లోనూ టాస్ గెలిచాడు రోహిత్ శర్మ. అయితే ఈసారి టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్నాడు రోహిత్. ఇప్పటికే మొదటి రెండు మ్యాచులు గెలిచిన భారత జట్టు, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ క్వీన్ స్వీప్ చేయాలని ఆశపడుతోంది. టీ20 పూర్తి స్థాయి కెప్టెన్‌గా మొట్టమొదటి సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ, కివీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే ఆ ఘనత సాధించిన తొలి భారత సారథిగా అరుదైన రికార్డు క్రియేట్ చేస్తాడు...

Read: రోహిత్ శర్మ సక్సెస్‌కి ఆ ఆస్ట్రేలియా ప్లేయరే కారణం... ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో...

2013 ఐపీఎల్‌లో కోల్‌కత్తా గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ, ఇదే స్టేడియంలో ముంబైకి మొదటి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2012లో ఇదే వేదికలో తన ఐపీఎల్ కెరీర్‌లో ఏకైక సెంచరీ బాదాడు రోహిత్ శర్మ...  అలాగే 2013లో ఆరంగ్రేటం టెస్టు మ్యాచ్‌లో ఇదే స్టేడియంలో సెంచరీ చేశాడు...

అలాగే వన్డే కెరీర్‌లో 2014లో శ్రీలంకపై అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగుల స్కోరు చేశాడు. రోహిత్ శర్మకు ఎంతో కలిసి వచ్చిన ఈ స్టేడియంలో పూర్తి స్థాయి టీమిండియా టీ20 కెప్టెన్‌గా టైటిల్ అందుకోబోతున్నాడు రోహిత్ శర్మ...

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 264 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న భారత జట్టుకి, మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌కి (263) మధ్య తేడా కేవలం ఒకే ఒక్క పాయింట్... 

ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్, మొదటి రెండు టీ20 మ్యాచుల్లో గెలిచింది. నేటి మ్యాచ్‌లో భారత జట్టు ఓడితే, ఐసీసీ టీ20 టీమ్స్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ రెండో స్థానానికి ఎగబాకి, భారత జట్టు మూడో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంటుంది...

ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో ఆఖరి టీ20 మ్యాచ్‌లో యంగ్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్‌లకు అవకాశం దొరుకుతుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆశించినా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగాలకు అవకాశం ఇవ్వలేదు. కేవలం టెస్టు సిరీస్ జట్టులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, కెఎల్ రాహుల్‌లకు రెస్ట్ ఇచ్చి, వారి స్థానంలో ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహాల్‌లకు జట్టులో చోటు ఇచ్చాడు...

గత రెండు టీ20 మ్యాచుల్లో న్యూజిలాండ్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన సీనియర్ పేసర్ టిమ్ సౌథీ, నేటి మ్యాచ్‌లో ఆడకపోవడంతో అతని స్థానంలో మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌథీ స్థానంలో ఫర్గూసన్‌కి తుదిజట్టులో చోటు దక్కింది.

Read Also: ఈ మాత్రం దానికి వరల్డ్ కప్ టోర్నీ ఎందుకు... టాస్ గెలిచిన వాళ్లకు టైటిల్ ఇచ్చేస్తే, సరిపోయేదిగా...

భారత జట్టు: రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహాల్, హర్షల్ పటేల్, దీపక్ చాహార్, భువనేశ్వర్ కుమార్

న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గప్టిల్, డార్ల్ మిచెల్, మార్క్ ఛాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సిఫర్ట్, జిమ్మీ నీశమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ,లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ 

Follow Us:
Download App:
  • android
  • ios