Asianet News TeluguAsianet News Telugu

INDvsNZ 2nd ODI: రెండో వన్డేలోనూ టాస్ గెలిచిన న్యూజిలాండ్... మరోసారి సంజూ శాంసన్‌కి నిరాశ...

వర్షం కారణంగా ఆలస్యమైన టాస్... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. మరోసారి సంజూ శాంసన్‌కి నిరాశ! రెండు మార్పులతో బరిలోకి భారత జట్టు..

INDvsNZ 2nd ODI: Toss delayed due to wet outfield, must win match for team India
Author
First Published Nov 27, 2022, 6:55 AM IST

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా నేడు టీమిండియా రెండో వన్డే ఆడుతోంది. తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, సిరీస్‌ని నిలుపుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. హామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేకి వర్షం అంతరాయం కలిగించింది. టీ20 సిరీస్‌లో వర్షం కారణంగా  మొదటి టీ20 పూర్తిగా రద్దు కాగా, మూడో టీ20 టైగా ముగిసింది. వర్షం కారణంగా రెండో వన్డేలో టాస్ 20 నిమిషాలు ఆలస్యమైంది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా మరోసారి తొలుత బ్యాటింగ్ చేయనుంది. నేటి మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలో దిగుతుంటే, న్యూజిలాండ్ జట్టు ఓ మార్పు చేసింది. 

తొలి వన్డేలో టీమిండియా టాపార్డర్ చక్కగా రాణించింది. యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో పాటు కెప్టెన్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. అయితే రిషబ్ పంత్ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. 

వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సంజూ శాంసన్‌ని తుది జట్టు నుంచి తప్పించింది టీమిండియా. శాంసన్ స్థానంలో దీపక్ హుడాకి అవకాశం కల్పించారు. తొలి వన్డేలో ఆరంగ్రేటం బౌలర్ ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీసి మంచి ప్రదర్శన ఇవ్వగా శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్ పెద్దగా మెప్పించలేకపోయారు. యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్‌లకు కూడా వికెట్లు దక్కలేదు. ముఖ్యంగా సీనియర్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ భారీగా పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు.

దీంతో శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహార్‌కి తుది జట్టులో చోటు కల్పించింది టీమిండియా. గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన దీపక్ చాహార్, నేటి మ్యాచ్ ద్వాారా రీఎంట్రీ ఇస్తున్నాడు... మరోసారి న్యూజిలాండ్ జట్టు ఆడమ్ మిల్నే స్థానంలో మైకెల్ బ్రాస్‌వెల్‌కి తుది జట్టులో చోటు కల్పించింది. 

భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహార్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే, కేన్ విలియంసన్ (కెప్టెన్), డార్ల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్

 

Follow Us:
Download App:
  • android
  • ios