ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. 143 బంతుల్లో 11 ఫోర్లతో 73 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... ఊహించని రీతిలో అవుటై పెవిలియన్ చేరాడు. ఛతేశ్వర్ పూజారా టెస్టుల్లో 70+ స్కోరు వద్ద అవుట్ కావడం ఇది తొమ్మిదో సారి.

డామ్ బేస్ బౌలింగ్‌లో పూజారా పుల్ షాట్ ఆడగా... షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తన్న ఫీల్డర్‌ హెల్మెట్‌‌కి తగిలిన బంతి గాల్లోకి ఎగిరి... కొద్దిదూరంలో ఉన్న రోరీ బర్న్స్ దాన్ని క్యాచ్‌గా అందుకోవడంతో ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. 

ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇంగ్లాండ్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్..