INDvsAUS: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ రెండో టెస్టును కూడా గెలుచుకుంది.   బ్యాటింగ్ లో  పెద్దగా రాణించకున్నా బౌలర్ల చొరవతో  టీమిండియా విక్టరీ కొట్టింది. నాగ్‌పూర్-ఢిల్లీ మధ్య కొన్ని  మారినా ఏమీ మారని ఒకే ఒక్క క్రికెటర్  కెఎల్ రాహుల్. 

భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ (టెస్టులలో) కెఎల్ రాహుల్ పేలవ ఫామ్ తో తంటాలుపడుతున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న రాహుల్.. నాగ్‌పూర్ టెస్టుతో పాటు ఢిల్లీలోనూ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. టీమిండియా మ్యాచ్ లు గెలవడం వల్ల సరిపోతుంది గానీ ఫలితాలు తేడా వస్తే మాత్రం పరిస్థితి మరో విధంగా ఉండేది. అవతల శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ తో పాటు దేశవాళీలో సర్ఫరాజ్ ఖాన్ రూపంలో మెడపై కత్తి వేలాడుతున్నా రాహుల్ మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు.

తొలి టెస్టులో 20 పరుగులే చేసిన రాహుల్.. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 17 రన్స్ కే వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్ లో అయితే మరీ అధ్వాన్నంగా ఒక్క పరుగే చేశాడు. రాహుల్ నిష్క్రమణ అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా అతడిపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. అందులో కొన్ని ఆణిముత్యాలు ఇవిగో.. 

సాధారణంగా రాహుల్ మీమ్స్ కోసమే పుట్టుంటాడు అని అనిపిస్తోంది గత నాలుగైదేండ్లుగా అతడి ఆట చూస్తే. ఎప్పుడో ఒకసారి సెంచరీ, హాఫ్ సెంచరీ చేయడం తర్వాత 20, 30 ఇన్నింగ్స్ వరకూ బిందాస్ గా ఉండటం అతడికే చెల్లింది. ఎన్ని సార్లు విఫలమైనా అతడు టీమ్ లోకి స్థానం ఎలా దక్కించుకుంటాడన్న ప్రశ్నకు సమాధానమే లేదు. తాజాగా నెటిజన్లు తమ మీమ్స్ లో రాహుల్ పై ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. 

Scroll to load tweet…

ఓ యూజర్ వెటకారంగా స్పందిస్తూ.. ‘కెఎల్ రాహుల్ గారి గొప్ప ఆటకు కృతజ్ఞతలు. ఒకవేళ అతడు గనక ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసి ఉంటే లేఆఫ్స్ లో భాగంగా ఎప్పుడో లేపేసేవారు. కానీ బీసీసీఐ మాత్రం అతడి మీద ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తుంది. అతడో వృథా. మొత్తం దేశానికే (జట్టుకు) భారం..’ అని ఫైర్ అయ్యాడు. మరో నెటిజన్.. ‘ఈ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో భారత్ పై సాధించిన అత్యంత కీలకమైన ఒక్క పరుగు ఆధిక్యాన్ని రాహుల్ చేశాడు. అసలు ఏమన్న ఇన్నింగ్సా అది...’ అని కామెంట్స్ చేశారు. 

Scroll to load tweet…


మరికొందరు సునీల్ శెట్టి (కెఎల్ రాహుల్ మామ) ఓ సినిమాలో ఓ వ్యక్తిని కొడుతున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘కెఎల్ ఇన్నింగ్స్ చూశాక సునీల్ శెట్టి రియాక్షన్ ఇదే...’అని పోస్ట్ చేశాడు. ఓ నెటిజన్ మాత్రం.. టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్.. ఇటీవలే ప్రధాని మోడీని కలిసిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘కెఎల్ రాహుల్ ప్యూచర్ గురించి చర్చించడానికి ప్రధానిని కలిసిన వెంకటేశ్ ప్రసాద్..’అని కామెంట్స్ చేశాడు. మరికొందరు కాంతారాలో క్లైమాక్స్ సీన్ ను షేర్ చేస్తూ ఫన్ ను పంచుతున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి.. 

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…