Asianet News TeluguAsianet News Telugu

INDvsAUS 2nd ODI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా... తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా... శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో అక్షర్ పటేల్‌కి అవకాశం..

INDvsAUS 2nd ODI: Australia won the toss and elected to field first, rohit sharma cra
Author
First Published Mar 19, 2023, 1:11 PM IST

విశాఖపట్నం వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ముంబైలో జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయిన ఆస్ట్రేలియా, వన్డే సిరీస్‌ ఆశలు నిలుపుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. లేదంటే టీమిండియా 2-0 తేడాతో వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకుంటుంది. బామ్మర్ది పెళ్లి కోసం తొలి వన్డేలో ఆడని రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు...

నేటి మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలో దిగుతోంది. తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీతో ఓపెనర్‌గా వచ్చి, ఫెయిల్ అయిన యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్... టీమ్ నుంచి తప్పుకున్నాడు. అలాగే తొలి వన్డేల్లో 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో అక్షర్ పటేల్‌కి తుది జట్టులో చోటు దక్కింది.. 

మరో వైపు ఆస్ట్రేలియా కూడా నేటి మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలో దిగుతోంది. గాయం కారణంగా తొలి వన్డేలో ఆడని వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, టీమ్‌లోకి తిరిగి వచ్చాడు. దీంతో గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఆసీస్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్, రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అలాగే ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్లేస్‌లో నాథన్ ఎల్లీస్‌కి అవకాశం కల్పించింది ఆస్ట్రేలియా...

స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియాతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లో ఓ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవగా మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియాపై తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. 

గత మ్యాచ్‌లో ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లపై భారీ ఆశలు పెట్టుకుంది టీమిండియా. వీరితో పాటు రోహిత్ శర్మ కూడా రీఎంట్రీ ఇవ్వడంతో టీమిండియా భారీ స్కోరు చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు. వైజాగ్‌లో గత రెండు రోజులుగా వర్షం పడుతోంది. నిన్న కురిసిన వర్షానికి పిచ్ చిత్తడిగా మారింది. అయితే మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం చాలా తక్కువని వాతావరణ శాఖ తెలియచేసింది..

 

టీమిండియా తుది జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ

 ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్కస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబ్బాట్, నాథన్ ఎల్లీస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

 

Follow Us:
Download App:
  • android
  • ios