Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాలో ఎవరికి వారే కెప్టెన్: చాహల్

ఇంగ్లాండ్ వేదికగా ఐసిసి వన్డే ప్రపంచ కప్ ఈ నెల చివర్లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. దాదాపు నెలన్నర పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకోసం అంతర్జాతీయ క్రికెట్ జట్లన్ని సిద్దమవుతున్నాయి. అయితే ఈ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. దీంతో తమపై వున్న అంచనాలకు తగ్గట్లుగా రాణించేందుకు భారత  ఆటగాళ్లు తగిన వ్యూహాలతో రెడీ అవుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో టీమిండియా బౌలర్ యజువేందర్ చాహల్ వరల్డ్ కప్ గురించి కీలమైన వ్యాఖ్యలు చేశాడు. 

indian team bowler chahal comments on dhoni
Author
Mumbai, First Published May 17, 2019, 5:19 PM IST

ఇంగ్లాండ్ వేదికగా ఐసిసి వన్డే ప్రపంచ కప్ ఈ నెల చివర్లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. దాదాపు నెలన్నర పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకోసం అంతర్జాతీయ క్రికెట్ జట్లన్ని సిద్దమవుతున్నాయి. అయితే ఈ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. దీంతో తమపై వున్న అంచనాలకు తగ్గట్లుగా రాణించేందుకు భారత  ఆటగాళ్లు తగిన వ్యూహాలతో రెడీ అవుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో టీమిండియా బౌలర్ యజువేందర్ చాహల్ వరల్డ్ కప్ గురించి కీలమైన వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియా తరపున ఆడేటప్పుడు ప్రతి ప్లేయర్ తనకు తానే కెప్టెన్ గా భావిస్తాడని చాహల్ తెలిపాడు. ఇలా ఒకరు చెప్పాల్సిన పని లేకుండానే ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడతారని పేర్కొన్నాడు. జట్టులో ఏ ఆటగాడిపైనా ఎవరూ అజమాయిషీ చెలాయించరని... కానీ సీనియర్లు సలహాలు. సూచనలు మాత్రం ఇస్తుంటారని వెల్లడించాడు. 

ఇలా తమకు ఎంఎస్ ధోని ఎన్నో విలువైన సలహాలు ఇస్తుంటారని... పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా బౌలింగ్ చేయాలో సూచనలిస్తుంటాడని అన్నాడు. పిచ్ లను అర్ధం చేసుకుని ఎలా బౌలింగ్ చేస్తే ప్రత్యర్థులను బోల్తా  కొట్టించగలమో బౌలర్లమయిన మాకంటే ధోనికే బాగా తెలుసన్నాడు. అలా ఈ ప్రపంచ కప్ లోనూ ధోని సూచనలు భారత ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడతాయని చాహల్ అభిప్రాయపడ్డాడు. 

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా సాధన చేస్తున్నట్లు చాహల్ తెలిపాడు. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్ చేసేలా,  ఉత్తమంగా పీల్డింగ్ చేసే దిశగా మా ప్రాక్టీస్ సాగుతోందన్నాడు. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో భారత జట్టుతో డ్రెస్సింగ్‌ రూం పంచుకోవడం ఎంతో గర్వంగా వుందని చాహల్ పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios