విక్రమ్ నటించిన ‘కోబ్రా’ మూవీ టీజర్ విడుదల...
ఫస్ట్ షాట్ నుంచి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై స్పెషల్ ఫోకస్...
మ్యాన్లీ లుక్స్‌తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన మాజీ ఆల్‌రౌండర్...
టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత పేసర్ ఇర్ఫాన్ పఠాన్. స్పిన్నర్ హర్భజన్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టుకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ఇర్ఫాన్ పఠాన్... భారత జట్టు తరుపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచులు ఆడి, 2700లకు పైగా పరుగులు, 300లకు పైగా వికెట్లు పడగొట్టాడు.
ఫామ్ కోల్పోయి భారత జట్టుకి దూరమైన ఇర్ఫాన్ పఠాన్... 2012లో చివరి వన్డే ఆడాడు. 8 ఏళ్ల తర్వాత 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఇర్ఫాన్ పఠాన్. క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్, విక్రమ్ హీరోగా రూపొందుతున్న ‘కోబ్రా’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. టీజర్ మొదటి షాట్ నుంచి ఆఖరి దాకా ఇర్ఫాన్ పఠాన్‌ను హైలెట్ చేసింది చిత్ర బృందం. పర్ఫెక్ట్ లుక్స్‌తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు ఇర్ఫాన్ పఠాన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైతే ఇర్ఫాన్ పఠాన్, నటుడిగా బిజీ అయ్యే అవకాశం ఉంది.
VIKRAM - IRFAN PATHAN: 'COBRA' TEASER... #Vikram stars in #Tamil film #Cobra... Costars cricketer #IrfanPathan [makes his acting debut]... Directed by R Ajay Gnanamuthu... An #ARRahman musical... Produced by SS Lalit Kumar. #CobraTeaser pic.twitter.com/D5KuE1RahB
— taran adarsh (@taran_adarsh) January 9, 2021
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 9, 2021, 11:17 AM IST