ఏంది సామీ నువ్వు ... ఇండియా మ్యాచ్ కోసం కూతురి పెళ్లిసంబంధాన్నే పక్కనబెట్టేసావా..!!

క్రికెట్ మ్యాచ్ కోసం స్కూళ్లు,కాలేజీలు చివరకు ఆఫీసులకు డుమ్మా కొట్టేవారిని చూసాం. ఏవయని పనులుంటే వాయిదా వేసుకోవడమూ చూసాం. కానీ ఓ అభిమాని టీ20 ప్రపంచకప్ ఇండియా మ్యాచ్ కోసం ఏకంగా కూతురు పెళ్ళిసంబంధాన్నే వాయిదా వేసుకున్నాడు...  

Indian Father postpones  daughter marriage discussion due to India vs England semifinal AKP

ICC T20 World Cup 2024 : క్రికెట్ అంటే ఇండియన్స్ పడిచస్తారనే విషయం అందరికీ తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ వుందంటే చాలా టీవిలకు అతుక్కుపోతారు... ఇక ప్రపంచ కప్, ఐపిఎల్ వంటి మెగా టోర్నీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్ లో టీమిండియా ఆడుతుందంటే ఎప్పుడూ రద్దీగా వుండే రోడ్లు ఖాళీగా మారడం మనం చూస్తుంటాం... ఇక  ఐపిఎల్ కాలంలో సినిమాలను రిలీజ్ చేయాలంటే సార్ట్ హీరోలు, డైరెక్టర్లు సైతం భయపడిపోతారు. ఇవి చాలు మనోళ్లకు క్రికెట్ పై అభిమానం ఏ స్థాయిలో వుందో అర్థంచేసుకోడానికి. 

అయితే తాజాగా ఐసిసి టీ20 వరల్డ్ కప్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది... ఈ మెగా టోర్నీలో టీమిండియా అదరగొడుతోంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచులను చూసేందుకు అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ ను మట్టికరిపించిన రోహిత్ సేన ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇవాళ ప్రపంచ కప్ ఫైనల్ పోరు ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగనుంది. 

అయితే ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ అభిమానులకు మాంచి థ్రిల్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ కోసం ఓ ఆడబిడ్డ తండ్రి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కూతురు పెళ్లిసంబంధం కంటే ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ కే ఆ తండ్రి ప్రాధాన్యత ఇచ్చాడు... పెళ్లిసంబంధం గురించి మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం అంటూ అతడు చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అమ్మాయి తండ్రి, అబ్బాయి మధ్య  సాగిన మెసేజ్ లు ఇలా... 

టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇండియా, ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ సమయంలోనే తన కజిన్ రాహుల్ మ్యాట్రిమొని సైట్ Shaadi.com లో చూసిన ఓ అమ్మాయి ప్రొఫైల్ నచ్చి అందులోని ఫోన్ నెంబర్ కు మెసేజ్ చేసాడని నైనా అనే యువతి ఎక్స్ వేదికన తెలిపింది. అయితే మ్యాచ్ తర్వాతే ఈ విషయం మాట్లాడదామని సదరు అమ్మాయి తండ్రి నుండి రిప్లై రావడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇలా రాహుల్, అమ్మాయి తండ్రి మధ్య సాగిన మెసేజెస్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో నైనా పోస్ట్ చేసారు.

రాహుల్ :హలో, నేను రాహుల్, బెంగళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను... ఏడాదికి 70 లక్షల జీతం వస్తుంది. షాదీ డాట్ కామ్ లో  మీ కూతురు ఫ్రొఫైల్ చూసాను. ఈ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు. 

అమ్మాయి తండ్రి : హలో. నేను ప్రియాంక (అమ్మాయి పేరు) తండ్రిని. ప్రస్తుతం నేను మ్యాచ్ (ఇండియా, ఇంగ్లాండ్) చూస్తున్నారు. మ్యాచ్ తర్వాత పెళ్లిసంబంధం విషయం మాట్లాడుకుందాం. థ్యాంక్యూ! 


 


 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios