Asianet News TeluguAsianet News Telugu

రెండో వన్డేలో టీమిండియా ఓటమి... వన్డే సిరీస్ కూడా సౌతాఫ్రికా వశం...

3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా... మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న సఫారీ జట్టు...

India vs South Africa: Team India lost Second ODI and Series against South Africa, KL Rahul
Author
India, First Published Jan 21, 2022, 10:02 PM IST

సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ నెగ్గలేకపోయిన భారత జట్టు, వన్డే సిరీస్ కోసం అప్పగించేసింది. రెండో వన్డేలో 288 పరుగుల టార్గెట్‌ ఛేదనలో భారత బౌలర్లు, సఫారీ బ్యాట్స్‌మెన్‌ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన సౌతాఫ్రికా 2-0 తేడాతో సిరీస్ గెలిచింది.

తొలి వికెట్‌కి 132 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో లక్ష్యఛేదనను దూకుడుగా ప్రారంభించింది సౌతాఫ్రికా. భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో కూడా ఈజీగా బౌండరీలు బాదారు సఫారీ ఓపెనర్లు.  66 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయడంతో తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా...

అయితే ఆ తర్వాత కూడా సఫారీ బ్యాటర్ల దూకుడు తగ్గలేదు. జన్నేమన్ మలాన్, భవుమ కలిసి రెండో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 108 బంతు్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 91 పరుగులు చేసిన జన్నేమన్ మలాన్‌ను జస్ప్రిత్ బుమ్రా బౌల్డ్ చేశాడు... ఆ తర్వాత 36 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేసిన భవుమ, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

వరుసగా ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా, చేయాల్సిన రన్‌రేట్ 4 కంటే తక్కువ ఉండడంతో తర్వాతి బ్యాట్స్‌మెన్ కంగారు లేకుండా మ్యాచ్‌ని ముగించారు...

అయిడిన్ మార్క్‌రమ్ 41 బంతుల్లో 4 ఫోర్లతో 37 పరుగులు చేయగా, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 38 బంతుల్లో 2 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి అజేయంగా 74 పరుగులు జోడించారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. 

శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ కలిసి టీమిండియాకి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 38 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు...

శిఖర్ ధావన్ అవుటైన తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 5 బంతులాడిన విరాట్ కోహ్లీ, కేశవ్ మహరాజ్ బౌలింగ్ సఫారీ కెప్టెన్ భవుమాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొదటి వన్డేలో కూడా విరాట్ కోహ్లీ ఇదే విధంగా అవుట్ కావడం విశేషం...

64 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్‌కి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 79 బంతుల్లో 4 ఫోర్లతో 55 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మగల బౌలింగ్‌లో అవుట్ కాగా, 71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు చేసిన రిషబ్ పంత్... షంసీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

రిషబ్ పంత్‌కి వన్డేల్లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ కాగా ఇదే అతని అత్యుత్తమ స్కోరు.  కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వెంటవెంటనే అవుట్ కావడంతో 183 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. శ్రేయాస్ అయ్యర్ 14 బంతుల్లో 11 పరుగులు చేసి తీవ్రంగా నిరాశ పరచగా... వెంకటేశ్ అయ్యర్ 33 బంతుల్లో ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు...

సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రిషబ్ పంత్. ఇంతకుముందు 2001లో రాహుల్ ద్రావిడ్‌ చేసిన 77 పరుగులను, 2013లో ఎమ్మెస్ ధోనీ చేసిన 65 పరుగుల రికార్డును అధిగమించాడు రిషబ్ పంత్...

చివర్లో శార్దూల్ ఠాకూర్ 40, రవిచంద్రన్ అశ్విన్ 25 పరుగులు చేయడం ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా. 

Follow Us:
Download App:
  • android
  • ios