IND VS SA : రింకూకు మంకీ కరిచిందోచ్..: శుభ్ మన్ గిల్ ఫన్నీ కామెంట్స్

యువ క్రికెటర్ రింకూ సింగ్ ఫిట్ నెస్ పై శుభ్ మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఓ ఇంటర్వ్యూలో వుండగానే రింకూను సరదాగా ఆటపట్టించాడు గిల్.   

INDIA VS SOUTH AFRICA :  Shubman gill Funny comments on Rinku Singh AKP

సౌతాఫ్రికా : ప్రస్తుతం టీమిండియా యువ క్రికెటర్లతో నిండిపోయింది. ఐపిఎల్ లో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన యంగ్ ఆండ్ డైనమిక్ ప్లేయర్స్ కి దేశంకోసం ఆడే అవకాశాన్ని కల్పిస్తోంది బిసిసిఐ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటికే శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటివారు జట్టులో స్థిరమైన చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు వీరిలాగే మరో యువకెరటం రింకూసింగ్ కూడా టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోని లాగే మంచి ఫినిషర్ గా పేరుతెచ్చుకున్నాడు రింకూ. ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం... అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసే సత్తా అతడి సొంతం. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సీరిస్ లోనూ మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా సీరిస్ ఆడే భారత జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు రింకూసింగ్. 
 
అయితే వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంతో పాటు ఫీల్డింగ్ లో చాలా చురుగ్గా వుంటాడు రింకూసింగ్. ఇలా రింకూ వేగంగా పరుగెత్తడంపై తోటి క్రికెటర్ శుభ్ మన్ గిల్ సరదా కామెంట్స్ చేసాడు. కోతి కరవడం వల్లే రింకూ వేగంగా పరుగెత్తుతున్నాడంటూ గిల్ ఆటపట్టించాడు. 

దక్షిణాఫ్రికాలో వున్న యువ క్రికెటర్ల ఫిట్ నెస్ పై బిసిసిఐ ఓ ఇంటర్వ్యూ చేపట్టింది. ఇలా రింకూ సింగ్ ను కూడా మైదానంలోనే ఇంటర్వ్యూ చేసారు. ఈ క్రమంలోనే తన ఫిట్ నెస్ గురించి చెబుతుండగా వెనకాల నుండి  శుభ్ మన్ గిల్ ఎంటరయ్యాడు. కోతి కరవడమే రింకూ పరుగుకు కారణమంటూ సరదాగా కామెంట్ చేసాడు. దీంతో ఒక్కసారిగా ఇద్దరు ఆటగాళ్ళ ముఖాల్లో నవ్వులు విరిసాయి. 

 

అయితే రింకూ పరుగు గురించి గిల్ సరదాగానే చెప్పినా కోతి కరవడం మాత్రం నిజమేనట. కోతి కరవడంతో చేతికి అయిన గాయాన్ని రింకూ చూపించాడు. కానీ ఇది తన ఫిట్ నెస్ కు కారణం మాత్రం కాదని రింకూ కూడా ఫన్నీ కామెంట్స్ చేసాడు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios