India vs Pakistan: హాఫ్ సెంచరీ చేసి అవుటైన రోహిత్, శుబ్‌మన్ గిల్... రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...
India vs Pakistan: హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ... తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం..

ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 రౌండ్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకి శుభారంభం దక్కింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 15 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 115 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు..
షాహీన్ షా ఆఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాది, ఖాతా తెరిచాడు రోహిత్ శర్మ. షాహీన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో, ఆ తర్వాత ఐదో ఓవర్‌లో మూడేసి ఫోర్లు బాదాడు శుబ్‌మన్ గిల్. గత మ్యాచ్‌లో పాక్ పేసర్లను ఎదుర్కోవడానికి తెగ ఇబ్బందిపడిన శుబ్‌మన్ గిల్, నేటి మ్యాచ్‌లో కౌంటర్ అటాక్ చేశాడు..
నసీం షా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రోహిత్ పరుగులేమీ రాబట్టలేకపోయాడు. అయితే శుబ్‌మన్ గిల్ వేగంగా పరుగులు చేయడంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది భారత జట్టు..
శుబ్‌మన్ గిల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 28 పరుగులే చేసిన రోహిత్ శర్మ, షాదబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 6, 6, 4 బాది 19 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత షాదబ్ ఖాన్ ఖాన్ ఓవర్‌లో 6, 4 బాది 43 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
గత మ్యాచ్‌లో నేపాల్‌పై శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్‌కి ఆసియా కప్‌లో ఇది రెండో సెంచరీ భాగస్వామ్యం. వన్డే ఆసియా కప్‌లో ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ - విరాట్ కోహ్లీ రెండు సార్లు శతాధిక భాగస్వామ్యం నెలకొల్పగా ఆ రికార్డును రోహిత్ శర్మ - శుబ్‌మన్ గిల్ సమం చేశారు.
తొలి వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది టీమిండియా. 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పహీం ఆష్రఫ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ కూడా పెవిలియన్ చేరాడు..
52 బంతుల్లో 10 ఫోర్లతో 58 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అఘా సల్మాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 121/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయి 123/2 స్థితికి చేరుకుంది.