12:12 AM (IST) Sep 15

India vs Pakistan Live Score, Asia Cup 2025:పాకిస్తాన్ పై భారత్ గెలుపు

భారత ప్లేయర్లు అద్భుతమైన ఆటతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు.

పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 127/9 పరుగులు చేసింది.

భారత జట్టు 15.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్ కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

Scroll to load tweet…

11:02 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:తిలక్ వర్మ అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్

భారత్ మూడో వికెట్ ను కోల్పోయింది. తిలక్ వర్మ 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

IND 97/3 (12.2) CRR: 7.86 REQ: 4.04

10:22 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:ఉన్నంత సేపు పాక్ ను షేక్ చేశాడు.. అభిషేక్ శర్మ అవుట్

భారత్ రెండో వికెట్ ను కోల్పోయింది. అభిషేక్ శర్మ 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 

IND 41/2 (3.4) CRR: 11.18 REQ: 5.33

10:15 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:గిల్ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. శుభ్ మన్ గిల్ బిగ్ షాట్ ఆడటానికి ముందుకు రాగా, స్టంపౌట్ అయ్యాడు. 10 పరుగుల వద్ద గిల్ అవుట్ అయ్యాడు. 

IND 26/1 (2.2) CRR: 11.14 REQ: 5.77

10:07 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:బౌండరీలతో భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన అభిషేక్ శర్మ

మొదటి బాల్ ఫోర్.. రెండో బాల్ సిక్సర్.. అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్ ను దంచికొట్టాడు. 

09:48 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:హార్దిక్ బౌలింగ్ ను దంచికొట్టిన షాహీన్ అఫ్రిది.. భారత్ టార్గెట్ ఎంతంటే?

పాకిస్థాన్ తమ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను పూర్తి చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. చివరి ఓవర్ లో షాహీన్ అఫ్రిది సిక్సర్ల మోత మోగించాడు. వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అతను 16 బంతులు ఆడి 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

భారత జట్టు విజయానికి 128 పరుగులు కావాలి.

09:33 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:8వ వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

పాకిస్తాన్ 8వ వికెట్ కోల్పోయింది. అష్రాఫ్ 11 పరుగల వద్ద అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు.

 PAK 97/8 (17.4) CRR: 5.49

09:25 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:మూడో వికెట్ తీసుకున్న కుల్దీప్ యాదవ్.. పాకిస్తాన్ 83/7

పాకిస్తాన్ 7వ వికెట్ ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ తో పర్హాన్ ను అవుట్ చేశాడు. అతను 40 పరుగుల వద్ద బిగ్ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యా కు క్యాచ్ గా చిక్కాడు.

PAK 83/7 (16.1) CRR: 5.13

09:09 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:కుల్దీప్ డబుల్ స్ట్రైక్

కుల్దీప్ యాదవ్ డబుల్ స్ట్రైక్ తో అదరగొట్టాడు. వరుసగా రెండు వికెట్లు తీసి పాక్ ను దెబ్బకొట్టాడు. 5వ వికెట్ గా హసన్ నవాజ్ 5 పరుగుల వద్ద, ఆ తర్వాత మహ్మద్ నవాజ్ అవుట్ అయ్యాడు.

PAK 64/6 (12.5) CRR: 4.99

09:06 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:కుల్దీప్ యాదవ్ కు తొలి వికెట్.. 5 వికెట్ కోల్పోయిన పాక్

పాకిస్తాన్ 5వ వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో హసన్ నవాజ్ 5 పరుగుల వద్ద అక్షర్ పటేల్ కు క్యాచ్ గా చిక్కాడు. 

PAK 64/5 (12.4) CRR: 5.05

08:55 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:అక్షర్ అదరగొడుతున్నాడు.. 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన పాక్

పాకిస్తాన్ 4వ వికెట్ ను కోల్పోయింది. అక్షర్ పటేల్ సూపర్ బౌలింగ్ తో తన రెండో వికెట్ గా పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ను అవుట్ చేశాడు. అతను బౌండరీ లైన్ వద్ద అభిషేక్ శర్మకు క్యాచ్ గా దొరికిపోయాడు.

PAK 49/4 (10) CRR: 4.9

08:45 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:తొలి ఓవర్ లోనే ఫఖర్ జమాన్ ను అవుట్ చేసిన అక్షర్ పటేల్

పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్ లో బిగ్ షాట్ ఆడబోయిన ఫఖర్ జమాన్ (17 పరుగులు) క్యాచ్ రూపంలో తిలక్ వర్మ చేతికి చిక్కాడు. 

పాకిస్తాన్ : 45/3 (7.4) CRR: 5.87 

08:40 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:పవర్ ప్లే తర్వాత పాకిస్తాన్ 42/2

పవర్ ప్లే తర్వాత పాకిస్తాన్ 42/2 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఫఖర్ జమాన్ 16 పరుగులు (3 ఫోర్లు), సాహిబ్‌జాదా ఫర్హాన్ 19 పరుగులు (2 సిక్సర్లు) ఉన్నారు. పాకిస్థాన్ ప్రస్తుత రన్‌రేట్ 6.81గా ఉంది.

Scroll to load tweet…

08:33 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:5 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ 34/2

5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది పాకిస్తాన్. క్రీజులో సాహిబ్‌జాదా ఫర్హాన్ 13 బంతుల్లో 11 పరుగులు, ఫఖర్ జమాన్ 11 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుత రన్ రేట్ 6.8గా ఉంది.

పాకిస్తాన్ 34/2 (5 ఓవర్లు)

08:10 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:బూమ్ బూమ్ బుమ్రా.. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

భారత బౌలర్లు అదరగొడుతున్నారు. బుమ్రా దెబ్బతో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ హరీస్ 3 పరుగులకే అవుట్ అయ్యాడు. బుమ్రాకు క్యాచ్ గా దొరికిపోయాడు. 

PAK 6/2 (1.2) CRR: 4.5

08:05 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:ఫస్ట్ బాల్.. అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీసి భారత్ కు శుభారంభం అందించాడు హార్దిక్ పాండ్యా. తన ఓవర్ లో వైడ్ ప్రారంభించిన హార్దిక్ ఆ తర్వాత బంతికి సైమ్ అయూబ్ అవుట్ చేశాడు. అతను బుమ్రాకు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.

07:57 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:దుబాయ్ పిచ్ రిపోర్ట్

సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. "ఈ పిచ్ మిగతా వాటితో పోలిస్తే పొడిగా ఉంది, కాబట్టి స్పిన్ ఒక ముఖ్యమైన అంశం కావచ్చు" అని అన్నారు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. "పాకిస్తాన్ ఈ పిచ్ నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నట్లుంది, వారి జట్టు ఎంపికను చూస్తే ఇది అర్థమవుతుంది" అని అన్నారు. కాగా, ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి అనుకూలంగా ఉంటుంది. అయితే, మ్యాచ్ మధ్యలో స్పిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

07:49 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:భారత్, పాకిస్తాన్ ప్లేయింగ్ 11

భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్తాన్ జట్టు: సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మొహమ్మద్ హరీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫాహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.

Scroll to load tweet…

07:46 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:మేము మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం.. : సూర్యకుమార్ యాదవ్

మేము మొదట బౌలింగ్ చేయాలనుకున్నామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మేము దీని పక్కనే ఉన్న మరో పిచ్‌పై ఆడాం, అది చాలా మంచి వికెట్. రాత్రిపూట బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు తేమ ఎక్కువగా ఉంది, కాబట్టి తరువాత మంచు ప్రభావం ఉండవచ్చు. జట్టులో ఎటువంటి మార్పులు లేవు అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

Scroll to load tweet…

07:40 PM (IST) Sep 14

India vs Pakistan Live Score, Asia Cup 2025:టాస్ గెలిచిన పాకిస్తాన్

టాస్‌ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా బ్యాటింగ్ ఎంచుకున్నారు.

ఆఘా మాట్లాడుతూ “మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. చాలా ఉత్సాహంగా ఉన్నాం. పిచ్ నెమ్మదిగా కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసి బోర్డుపై పరుగులు పెట్టాలని అనుకుంటున్నాం. జట్టులో మార్పులు లేవు. ఇక్కడ 20 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కండీషన్లకు అలవాటు పడ్డాం” అని తెలిపారు.