Asianet News TeluguAsianet News Telugu

Ind Vs Nz: ఏం ఆట భయ్యా అది.. ఇక రిటైర్ అయితే బెటర్.. సాహా ఆటతీరుపై ట్విట్టర్ లో దారుణమైన ట్రోలింగ్..

India Vs New Zealand 1st Test: ఇండియా-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు భారత్  అనూహ్యంగా కుప్పకూలింది. భారత జట్టు వికెట్ కీపర్ వ‌ృద్ధిమాన్ సాహా..  పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించాడు.

India Vs New Zealand: Time For India To Move Away From wriddhiman Saha, Twitter Reacts after His dismissal In kanpur test
Author
Hyderabad, First Published Nov 26, 2021, 1:16 PM IST

న్యూజిలాండ్ తో జరుగుతున్న  తొలి  టెస్టులో మొదటి రోజు నిలకడగా  ఆడిన భారత జట్టు రెండో రోజు తడబడింది.  అరంగ్రేట టెస్టులోనే సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ కు తోడుగా ఎవరూ నిలవకపోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులకు  ఆలౌట్ అయింది. అయితే లోయారార్డర్ సంగతి పక్కనబెడితే జట్టులోకి స్పెషలిస్టు వికెట్ కీపర్  కమ్ బ్యాటర్ గా వచ్చిన వృద్ధిమాన్ సాహా ఆటతీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక్కటంటే ఒక్కటే పరుగు చేసి ఔట్ అవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాహా రిటైర్ అయితే బెటర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

రెండో రోజు ఆటలో భాగంగా రవీంద్ర జడేజా ఔట్ అయ్యాక సాహా క్రీజులోకి వచ్చాడు. 12 బంతులాడిన సాహా.. సౌథీ వేసిన 93 ఓవర్ రెండో బంతికి కీపర్ కు  క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  పరుగులు చేయడం సంగతి అటుంచితే క్రీజులో నిలదొక్కుకోవడానికి కూడా జడేజా  ఇబ్బంది పడ్డాడు.  ఈ నేపథ్యంలో ట్రోలర్స్ అతడిని దారుణంగా  ట్రోల్ చేస్తున్నారు. 

 

‘సాహాను జట్టు నుంచి తప్పించి.. కెఎస్ భరత్ ను ఆడించండి..’,  ‘వృద్ధిమాన్ సాహాను ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు...?’ ‘భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అతడు (సాహా) ఆడటం లేదు. ఇక అతడికి జట్టులో చోటు దక్కడం కష్టమే..’, ‘ఇక చాలు.. వృద్ధిమాన్ సాహాను తప్పించి కెఎస్ భరత్ ను వికెట్  కీపర్ గా చేస్తేనే టీమిండియాకు మంచిది..  అయినా బ్యాకప్ ఆప్షన్ గా భరత్ ను ఎంపిక చేసి మరీ ఇంకా ఇతడిని ఎందుకు ఆడిస్తున్నారు..?’, ‘ఇప్పుడర్థమైందా  సాహాను తప్పించి పంత్ ను  టెస్టుల్లో వికెట్ కీపర్  చేస్తున్నారో..?’ ‘సాహా మంచి టెక్నిక్ ఉన్న వికెట్  కీపర్.. అతడిని వికెట్ కీపింగ్ కు కోచ్ ను చేయండి.. ’ ‘ఒకవేళ సాహా స్పెషలిస్టు వికెట్ కీపర్ అయితే అతడిని 11వ స్థానంలో బ్యాటింగ్ కు పంపాలి.. ’అంటూ నెటిజన్లు  మండిపడుతున్నారు. 

 

ఈ మ్యాచ్ లో ఒక్క పరుగుకే ఔటైనా.. సాహా మాత్రం అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన అత్యధిక వయస్సు కలిగిన వికెట్ కీపర్ గా అతడు మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ పేరును అధిగమించాడు. చివరి టెస్టు  మ్యాచ్ ఆడినప్పుడు  ఫరూఖ్ వయస్సు 36 ఏండ్ల 338 రోజులు. సాహా వయస్సు 37 ఏండ్ల 32 రోజులు. కాగా ఈ జాబితాలో దత్తరామ్ హిండ్లేకర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. తన చివరి టెస్టు   మ్యాచ్ ఆడినప్పుడు హిండ్లేకర్ వయస్సు 37 ఏండ్ల 231 రోజులు.

Follow Us:
Download App:
  • android
  • ios