Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత...

27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... 17 పరుగులు చేసి పెవిలియన్ చేరిన శుబ్‌మన్ గిల్... స్వదేశంలో భారత్‌పై 100 వికెట్లు పూర్తి చేసుకున్న జేమ్స్ అండర్సన్... 

India vs England 5th Test: Team India lost Shubman Gill wicket early, James Anderson creates rare record
Author
India, First Published Jul 1, 2022, 4:03 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 24 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన భారత యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో జాక్ క్రావ్లేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు...

ఛతేశ్వర్ పూజారాతో కలిసి ఓపెనింగ్‌కి వచ్చిన శుబ్‌మన్ గిల్, టెస్టు మ్యాచ్‌లో తొలి బంతిని ఎదుర్కొన్నాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో టెస్టు మ్యాచ్‌లో మొట్టమొదటి బంతిని ఎదుర్కొన్న మూడో అతి పిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు శుబ్‌మన్ గిల్.. 

ఇంతకుముందు 22 ఏళ్ల 33 రోజుల వయసులో విండీస్ ప్లేయర్ అడ్రియన్ బరత్, ఆ తర్వాత 22 ఏళ్ల 173 రోజుల వయసులో గ్రేమ్ స్మిత్... అండర్సన్ బౌలింగ్‌లో టెస్టుల్లో ఫస్ట్ బాల్ ఫేస్ చేశారు.. ప్రస్తుతం శుబ్‌మన్ గిల్ వయసు  22 రోజుల 296 రోజులు...

జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ అవుట్ కావడం ఇది మూడో సారి. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 8 ఇన్నింగ్స్‌లు ఆడిన శుబ్‌మన్ గిల్, ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఇంతకుముందు స్వదేశంలో ఇంగ్లాండ్‌పై నాలుగు టెస్టులు ఆడిన శుబ్‌మన్ గిల్, రెండు సార్లు డకౌట్ అయ్యాడు.. ఇంగ్లాండ్‌తో 2021లో జరిగిన టెస్టు సిరీస్‌కి ముందు శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ని ఓపెనర్‌గా ఎంచుకుంది భారత జట్టు.

అయితే తొలి టెస్టు ఆరంభానికి ముందు నెట్ సెషన్స్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్, మయాంక్ అగర్వాల్ తలకి బలంగా తాకడంతో అతను మొదటి టెస్టుకి దూరమయ్యాడు. అతని స్థానంలో రెండేళ్ల తర్వాత తుది జట్టులోకి వచ్చిన కెఎల్ రాహుల్, అద్భుత ప్రదర్శనతో టెస్టుల్లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా ఉన్న కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ... ఐదో టెస్టుకి అందుబాటులో లేకపోవడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

శుబ్‌మన్ గిల్ వికెట్‌తో టీమిండియాపై స్వదేశంలో 100 టెస్టు వికెట్లు పూర్తి చేసుకున్నాడు జేమ్స్ అండర్సన్. ఇంతకుముందు ఏ బౌలర్ కూడా ఒకే ప్రత్యర్థిపై స్వదేశంలో ఈ ఘనత సాధించలేకపోయారు. ఆస్ట్రేలియాపై హర్భజన్ సింగ్ స్వదేశంలో 86 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉండగా ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, ఆస్ట్రేలియాపై 84 వికెట్లు తీసి మూడో స్థానంలో ఉన్నాడు..

మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన హనుమ విహారి, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హనుమ విహారి ఫేస్ చేసిన మొదటి రెండు బంతులకు ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ఇంగ్లాండ్ జట్టు. అయితే అంపైర్ నాటౌట్‌గా ఇవ్వడంతో హనుమ విహారి బతికిపోయాడు.. 

 

Follow Us:
Download App:
  • android
  • ios