India vs England 2nd Test Day 4 Live: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మూడవ రోజు, భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శనతో పాటు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ పోరాటంతో సమంగా నిలిచింది.
సిరాజ్ మెరుపులు మెరిపిస్తూ, జో రూట్, బెన్ స్టోక్స్‌లను ఒకే ఓవర్లో ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను 84/5 వద్ద కష్టాల్లో పడేశాడు. అయితే, జేమీ స్మిత్, బ్రూక్ కలిసి 303 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యంతో మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చాడు.
స్మిత్ ధాటిగా ఆడి, 184* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను లంచ్‌కు ముందు కేవలం 80 బంతుల్లో సెంచరీ కొట్టాడు.
హ్యారీ బ్రూక్ కూడా 158 పరుగులు చేయగా, రెండో న్యూ బాల్‌తో ఆకాశ్ దీప్ సక్సెస్ అయ్యాడు.
ఆ తర్వాత ఇంగ్లాండ్ చివరి ఐదు వికెట్లను కేవలం 20 పరుగులకే కోల్పోయి 407 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్ 6/70తో, ఆకాశ్ దీప్ 4/88 వికెట్లతో మెరిశారు. భారత్‌కు 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.
ఆ తర్వాత భారత్, స్టంప్స్ సమయానికి 64/1 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ ను జోష్ టంగ్ అవుట్ చేశాడు. దీంతో భారత్ కు మొత్తం 244 పరుగుల ఆధిక్యం లభించింది.