India vs Bangladesh: రాణించిన భారత బౌలర్లు... టీమిండియా ముందు ఊరించే టార్గెట్..

టీమిండియాపై 256 పరుగుల మంచి స్కోరు చేసిన బంగ్లాదేశ్... హాఫ్ సెంచరీలు చేసిన తన్జీద్ హసన్, లిటన్ దాస్... 

India vs Bangladesh: Team India impressive bowling, Bangladesh scores decent total CRA

పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు మంచి ప్రదర్శన ఇచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగుల ఓ మాదిరి స్కోరు చేయగలిగింది. 

తన్జీద్ హసన్, లిటన్ దాస్ కలిసి తొలి వికెట్‌కి 93 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసిన తన్జీద్ హసన్‌ని కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు..

17 బంతుల్లో 8 పరుగులు చేసిన నజ్ముల్ హసన్ షాంటోని రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూ చేయగా, 13 బంతులు ఆడిన మెహిదీ హసన్ మిరాజ్ 3 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 82 బంతుల్లో 7 ఫోర్లతో 66 పరుగులు చేసిన లిటన్ దాస్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

తోహిద్ హృదయ్ 16 పరుగులు చేసి అవుట్ కాగా ముస్తాఫికర్ రహీం 46 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు. షకీబ్ అల్ హసన్ తర్వాత వన్డే వరల్డ్ కప్‌లో 1000+ పరుగులు చేసిన రెండో బంగ్లా బ్యాటర్‌గా నిలిచాడు ముస్తాఫికర్ రహీం. 

18 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన నసుమ్ అహ్మద్‌, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. జస్ప్రిత్ బుమ్రా వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి మహ్మదుల్లా వికెట్ కోసం రివ్యూ కోరుకుంది టీమిండియా. అయితే రిప్లైలో నాటౌట్‌గా తేలింది. అయితే ఆ తర్వాతి బంతికి మహ్మదుల్లాని క్లీన్ బౌల్డ్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... ఇన్నింగ్స్ ఆఖరి బంతికి షోరిఫుల్ ఇస్లాం ఓ భారీ సిక్సర్ బాదాడు. 

భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా 3 బంతులు వేసిన హార్ధిక్ పాండ్యా గాయపడి ఫీల్డింగ్‌కి కూడా రాలేదు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కి చెరో వికెట్ దక్కింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios