టీమిండియా బంగ్లాదేశ్ ని ఓడించి టీ20 సిరీస్ ని కైవసం చేసుకుంది. జట్టు సిరీస్ గెలిచిన ఆనందం కంటే... పంత్ నిరాశకరమైన ఆటపైనే అభిమానులు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. జట్టు విజయానికి సహకరించిన క్రికెటర్లను మెచ్చుకోవడం మానేసి.. సరిగా ఆడని పంత్ పైనే పడ్డారు. ఇప్పటికే తొలి, రెండో టీ 20 మ్యాచ్ లో పంత్ చేసిన తప్పులపై విపరీంతంగా ట్రోల్ చేశారు. తాజాగా మరోసారి నెటిజన్లు పంత్ ని టార్గెట్ చేశారు. పంత్ ఆట తీరు సరిగా లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. 

ఆదివారం నాగపూర్ వేధికగా ఇండియా, బంగ్లాదేశ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తమ బ్యాటింగ్ తో చెలరేగడంతో భారీ స్కోరు చేయగలిగారు. ఆ తర్వాత బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో బంగ్లా జట్టు స్కోర్ చేధించలేకపోయింది. అయితే.. ఈ మ్యాచ్ లో కూడా పంత్ సరిగా రాణించలేకపోయాడు.

 

మూడో మ్యాచ్ లో పంత్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. పంత్ మరోసారి నిరాశపరిచాడంటూ నెటిజన్లు మండిపటడం గమనార్హం. పంత్ మైదానంలోకి అడుగుపెట్టగానే గజినీలా మారిపోయి.. నేను ఏం చేయడానికి వచ్చాను అని ఆలోచిస్తూ ఉండిపోతాడంటూ నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేయడం గమనార్హం.

పంత్ ఏ విధంగా ఔట్ అయ్యాడో ఫోటోలతో కూడా మీమ్స్ క్రియేట్ చేశారు. శ్రేయాస్ అయ్యర్ కి అవకాశం రాగానే సద్వినియోగం చేసుకున్నాడని... పంత్ మాత్రం ఎన్ని అవకాశాలు ఇచ్చినా వృథా చేస్తున్నాడని కొందరు మండిపడుతున్నారు. రిటైర్మెంట్ తీసుకోవాల్సింది ధోనీ కాదు పంత్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.