బంగ్లాదేశ్‎తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో భారత్‎పై బంగ్లాదేశ్ తొలి విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‎కు దిగిన బంగ్లాదేశ్‌ ఏడు వికెట్ల తేడాతో భారత్‎పై గెలిచి తొలి విజయం తన ఖాతాలో వేసుకుంది. బంగ్లా బ్యాటింగ్‎లో సౌమ్య సర్కార్ 39, నైమ్ 26, ముష్ఫికర్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేశారు.

కాగా... ఈ మ్యాచ్ మధ్యలో వికెట్ కీపర్ రిషబ్ పంత్.... రివ్యూ తీసుకుందామని అనుకున్నాడు. అందు కోసం కెప్టెన్ రోహిత్ శర్మను ఒప్పించాడు. అయితే....  ఆ రివ్యూ వర్కౌట్ కాలేదు. 

10వ ఓవర్ లో... సౌమ్య శేఖర్ వికెట్ నేపథ్యంలో... రిషబ్ పంత్... డీఆర్ఎస్ రివ్యూ తీసుకుందామని భావించాడు. వెంటనే... ఈ విషయాన్ని రోహిత్ శర్మకు  చెప్పాడు. రోహిత్ కూడా వెంటనే అందుకు అంగీకరించాడు. అయితే.. అది వర్కౌట్ కాలేదు. డీఆర్ఎస్ రివ్యూ వృథా అయిపోయింది. ఆ సమయంలో అప్పటికే జట్టు ఎంతో ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నోటి నుంచి మాట రాకుండా... కేవలం ఓ నవ్వుతో పంత్ కి సమాధానం చెప్పాడు. ఆ రియాక్షన్ కామిక్ గా ఉండటం గమనార్హం. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా...మ్యాచ్ ఓటమి అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. కాపాడుకోదగిన స్కోర్ తాము చేశామని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. కానీ... తాము చాలా తప్పులు చేశామన్నారు. ఆటగాళ్లు అంతా చాలా ఎక్స్ పీరియన్స్డ్ కాదని అన్నారు. వాళ్లు కూడా తప్పుల నుంచి  నేర్చేకుంటారని అభిప్రాయపడ్డాడు.డీఆర్ఎస్ విషయంలో తప్పులు చేశామని చెప్పాడు. బంగ్లాదేశ్ ఘనతను తక్కువ చేయకూడదని...  ఆజట్టు బాగా ఆడిందని చెప్పాడు. ఆరంభం నుంచి బంగ్లా టీం తమను ఒత్తిడిలోకి నెట్టిందని చెప్పాడు. 

ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కూడా పెద్దగా రాణించలేదు. కేవలం శిఖర్ ధావన్ మాత్రమే జట్టు పరువు నిలబెట్టాడు. కోహ్లి గైర్హాజరులో మూడో స్థానంలో అవకాశం దక్కించుకున్న లోకేశ్‌ రాహుల్‌ (15) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (26 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేదు. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ శివమ్‌ దూబే (1)కు కలిసి రాలేదు.

కృనాల్‌ పాండ్యా (8 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), సుందర్‌ (5 బంతుల్లో 14 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపుల కారణంగా చివరి 2 ఓవర్లలో భారత్‌ 30 పరుగులు రాబట్టింది. ఫలితంగా కొంత గౌరవప్రదమైన స్కోరు వద్ద ముగించగలిగింది.