రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్... టీమిండియా ముందు 145 పరుగుల ఈజీ టార్గెట్... 3 వికెట్లు తీసిన అక్షర్ పటేల్! అశ్విన్, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు...
బంగ్లాదేశ్ పర్యటనలో జరుగుతున్న రెండో,ఆఖరి టెస్టులో టీమిండియా ఆధిక్యం సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 7/0 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్ జట్టు 70.2 ఓవర్లలో 231 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యం పోగా టీమిండియా ముందు 145 పరుగుల టార్గెట్‌ని పెట్టింది.. 31 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
5 పరుగులు చేసిన మోమినుల్ హక్‌ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేయగా షకీబ్ అల్ హసన్ 13 పరుగులు చేసి జయ్‌దేవ్ ఉదన్కట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ముస్తాఫికర్ రహీం 9 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో లంచ్ బ్రేక్ సమయానకి ముందే 4 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్.. 135 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు చేసిన జాకీర్ హుస్సేన్, హాఫ్ సెంచరీ నమోదు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
మెహిదీ హసన్ మిరాజ్ డకౌట్ కావడంతో 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ దశలో నురుల్ హసన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసి ఏడో వికెట్‌కి 48 పరుగులు జోడించాడు. 98 బంతుల్లో 7 ఫోర్లతో 73 పరుగులు చేసిన లిటన్ దాస్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
టస్కిన్ అహ్మద్ 46 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా తైజుల్ ఇస్లాంను అశ్విన్ అవుట్ చేశాడు. ఖలీద్ అహ్మద్ రనౌట్ కావడంతో 231 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా అశ్విన్, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఉమేశ్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కట్ తలా ఓ వికెట్ తీశారు.
అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 86.3 ఓవర్లలో 314 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. టాపార్డర్ వైఫల్యంతో 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఆదుకున్నారు.
రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 పరుగులు చేసిన రిషబ్ పంత్, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో నురుల్ హసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అక్షర్ పటేల్ 4 పరుగులు చేసి నిరాశపరచగా 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
