రాజ్ కోట్: నిన్నటి కీలకమైన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. భారత్ చేసిన భారీ స్కోర్ ను చేధించే క్రమంలో ఆస్ట్రేలియా పోరాడి ఓడింది.

భారత్ విసిరిన లక్ష్య ఛేదన సవాల్ ను స్వీకరించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే వార్నర్ వికెట్ రూపంలో తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత కెప్టెన్ ఫించ్ ను కెఎల్ రాహుల్ అద్భుతమైన స్టంపింగ్ తో పెవిలిన్ చేర్చాడు. 

16వ ఓవర్లో రవీంద్రజడేజా వేసిన బంతిని ఆడబోయి అది కాస్త మిస్ అయింది. దాన్ని చాకచక్యంగా అందుకున్న రాహుల్ రెప్పపాటులో వికెట్లను గిరాటేసాడు. రాహుల్ అద్భుతమైన స్టంపింగ్ నైపుణ్యంతో ఒక్కసారిగా ఆస్ట్రేలియా అవాక్కయింది.

అభిమానులంతా రాహుల్ నైపుణ్యానికి ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని రిషబ్ పంత్ తో పోల్చడం మొదలుపెట్టారు. 

రిషబ్ పంత్ గతంలో వికెట్ కీపింగ్ చేస్తూ చాలా సందర్భాల్లో ఫెయిల్ అయ్యాడు. అతడ్ని అప్పట్లో ధోనితో కంపేర్ చేసిన అభిమానులు ఇప్పుడు కేఎల్ రాహుల్ తో పోల్చడం మొదలుపెట్టారు. పోల్చడం వరకు ఓకే. కానీ మనోళ్లు సోషల్ మీడియాలో వారి వారి సృజనాత్మకతకు పని పెట్టడంతో అవి నవ్వులు పూయిస్తున్నాయి. 

ఈ మ్యాచులో భారత బ్యాట్స్ మెన్ ధావన్, రాహుల్, కోహ్లీ, రోహిత్ లు రాణించారు. రాహుల్ ఫినిషర్ గా కూడా తానేమిటో ఈ మ్యాచులో ప్రూవ్ చేసుకున్నాడు. రాహుల్ మెరుపులతోనే నిన్న భారత్ అంత భారీ స్కోర్ చేయగలిగింది. 

మొత్తానికి సోషల్ మీడియాలో రిషబ్ పంత్ పై విపరీతమైన ట్రోలింగ్ మాత్రం సాగుతుంది. ఆ ట్రోలింగ్ ఏంటో మీరు కూడా ఒక లుక్కేయండి.