మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో అద్భుతంగా రాణించిన భారత్.. సమష్టిగా పోరాడి సమగ్ర విజయాన్ని అందుకుంది. అత్యంత కీలకమైన నిన్నటి రాజ్ కోట్ వన్డేలో విజయాన్ని అందుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 

ఇక సిరీస్ ను నిర్ణయించే, నిర్ణయాత్మక వన్డే రేపు  స్టేడియం వేదికగా జరగనుంది. హోరాహోరీగా సాగిన నిన్నటి పోరులో భారత జట్టు నిర్ణయాత్మక మంచును బెంగళూరు వరకు తీసుకుపోవడంలో విజయం సాధించింది. రేపటి మ్యాచులో మరింత ఉత్కంఠ గ్యారంటీగా కనబడుతుంది. 

ఇక నిన్నటి మ్యాచు విషయానికి వస్తే... హోరాహోరాగా సాగిన  నిన్నటి వన్డేలో చివర్లో భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెట్టె సర్దేయవలిసి వచ్చింది. ఒకానొక దశలో స్మిత్, లబుషెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆసీస్ విజయంవైపుగా పయనిస్తున్నట్టు అనిపించి, భారత శిబిరంలో ఆందోళన కలిగింది.  

Also read: వన్డే ఇంటర్నేషనల్... కుల్దీప్ యాదవ్ సంచలన రికార్డ్

అయితే, స్మిత్ సహా ఇతర బ్యాట్స్ మెన్ వికెట్లను ఠపాఠపా కోల్పోవడంతో చతికిల పడ్డ ఆస్ట్రేలియా పరాజయం పాలైంది.   అయితే ఈ మ్యాచులో ఓటమి తరువాత ఆస్ట్రేలియా ఎందుకు ఓడిందో పరిశీలిస్తుండగా ఒక ఆసక్తికర విషయం ఈ మ్యాచ్‌లో వెలుగుచూసింది. 

మిచెల్ స్టార్క్ బౌలింగ్ సెంటిమెంటు ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. నిన్నటి మ్యాచ్‌లో అతడు 10 ఓవర్లు వేసి 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంతటి స్టార్ బౌలర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మిచెల్ స్టార్క్ 70కి పైగా పరుగులు సమర్పించుకున్న ఏ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించైనా చరిత్ర లేదు. 

2013లో బర్మింగ్‌హమ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో స్టార్క్ 10 ఓవర్లు వేసి 75 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే కూల్చాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. 

2015లో మాంచెస్టర్‌లో మళ్ళీ ఇంగ్లండ్‌తోనే జరిగిన మరో మ్యాచ్‌లో 79 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో కూడా మళ్ళీ ఆస్ట్రేలియా ఓడింది. 

2018లో మెల్‌బోర్న్‌లో మళ్ళీ ఇంగ్లండ్‌తోనే జరిగిన వన్డేలో 71 పరుగులిచ్చి 2 వికెట్లు మాత్రమే తీసాడు. ఈ మ్యాచ్‌లో కూడా హిస్టరీ రిపీట్ అన్నట్టు కంగారూలు పరాజయం పాలయ్యారు. 

Also read;సచిన్, హషీం ఆమ్లా రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

2019లో లండన్ లోని ఓవల్‌ మైదానంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ 74 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ నేల కూల్చాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియా ఓడింది. 

తాజాగా, నిన్నటి రాజ్‌ కోట్‌ వన్డేలో కూడా స్టార్క్ 78 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ మ్యాచ్‌లో ఫలితం అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. 

సో, ఓవరాల్ గా ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ స్టార్క్ బౌలింగ్ లో ధారాళంగా పరుగులు పిండుకుంటే మ్యాచ్ ను అవతలి టీం గెలిచినట్టేనన్నట్టు. అయినా స్టార్ బౌలర్ విఫలమవడం చాలా అరుదు అనేది మరోసారి స్టార్క్ విషయంలో నిరూపితమైంది. చాలా తక్కువసార్లు మాత్రమే స్తర్క్ విఫలమయినట్టు మనం అర్థం చేసుకోవాలిసి ఉంటుంది.