సిడ్నీ: వర్షం కారణంగా కాస్సేపు నిలిచిపోయిన ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్టు తిరిగి ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా ఆదిలోనే వికెట్ కోల్పోయి మెల్లిగా కష్టాల్లోకి జారుకుంటున్న సమయంలో వర్షం ప్రారంభమయ్యింది. ఈ సమయంలో కేవలం 7.1 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. అప్పటివరకు ఆసిస్ 21/1తో నిలిచింది.

ఈ మ్యాచులో టీమిండియా టాస్ ఓడినప్పటికీ బౌలర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. డేంజరస్ బ్యాట్స్ మెన్ వార్నర్(5పరుగులు) వికెట్ తీసి కంగారులను కోలుకోలేని దెబ్బ తీసింది టీమిండియా. మూడవ ఓవర్లో సిరాజ్ అద్భుతమైన డెలివరీతో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు వార్నర్. ఇక ఆ తరువాత మరో నాలుగు ఓవర్లు కూడా పడకముందే వరుణ దేవుడు పలకరించడంతో ఆటకు అర్థాంతరంగా బ్రేక్ పడింది. 

 హిట్‌మన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచులో జట్టులోకి వచ్చాడు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ పై వేటు వేసిన కెప్టెన్ రహానే.... హిట్ మ్యాన్ కు మార్గం సుగమం చేసాడు. గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో అనూహ్యంగా నట్టూని కాదని నవదీప్‌ సైనిని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో భారత్‌ తరపున 299వ ఆటగాడిగా సైనీ
ఆరంగ్రేటం చేశాడు. 

కొద్దిసేపటి క్రితమే వర్షం నిలిచిపోవడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి తిరిగి మ్యాచ్‌ను ప్రారంభించారు. దీంతో 15 ఓవర్లకు ఆస్ట్రేలియా 41/1 స్కోర్‌ సాధించింది.