డేంజరస్ బ్యాట్స్ మెన్ వార్నర్ వికెట్ తీసి కంగారులను కోలుకోలేని దెబ్బ తీసింది టీమిండియా. మూడవ ఓవర్లో సిరాజ్ అద్భుతమైన డెలివరీతో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు వార్నర్. ఇక ఆ తరువాత మరో నాలుగు ఓవర్లు కూడా పడకముందే వరుణ దేవుడు పలకరించడంతో ఆటకు అర్థాంతరంగా బ్రేక్ పడింది.
బాక్సింగ్ డే టెస్టులో విజయఢంకా మోగించి సిరీస్ లో ముందడుగు వేయాలని భావిస్తున్న టీమిండియా.... నేటి మ్యాచులో టాస్ ఓడి బౌలింగ్ ని ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ ఇచ్చింది భారత్.
డేంజరస్ బ్యాట్స్ మెన్ వార్నర్ వికెట్ తీసి కంగారులను కోలుకోలేని దెబ్బ తీసింది టీమిండియా. మూడవ ఓవర్లో సిరాజ్ అద్భుతమైన డెలివరీతో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు వార్నర్. ఇక ఆ తరువాత మరో నాలుగు ఓవర్లు కూడా పడకముందే వరుణ దేవుడు పలకరించడంతో ఆటకు అర్థాంతరంగా బ్రేక్ పడింది.
ఉదయం 5 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ లో అరగంట ఆట జరగగానే మ్యాచ్ కు బ్రేక్ పడింది. ఇక అప్పటినుండి వర్షం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వాతావరణ పరిస్థితులను చూస్తే మరికాసేపట్లో వర్షం ఆగేలా కానబడుతుంది. వర్షం ఆగుతే 30 నిముషాల్లో మ్యాచ్ ను తిరిగి ప్రారంభించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 21/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
హిట్‌మన్ రోహిత్ శర్మ ఈ మ్యాచులో జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పై వేటు వేసిన కెప్టెన్ రహానే.... హిట్ మ్యాన్ కు మార్గం సుగమం చేసాడు. గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో అనూహ్యంగా నట్టూని కాదని నవదీప్ సైనిని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో భారత్ తరపున 299వ ఆటగాడిగా సైనీ ఆరంగ్రేటం చేశాడు.
Congratulations @navdeepsaini96. He realises his dream of playing Test cricket for #TeamIndia today. A proud holder of 🧢 299 and he receives it from @Jaspritbumrah93. #AUSvIND pic.twitter.com/zxa5LGJEen
— BCCI (@BCCI) January 6, 2021
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 7, 2021, 8:35 AM IST