115 కొట్టడానికి 5 వికెట్లు కోల్పోయి... ప్రయోగాలతో చచ్చీ చెడి గెలిచిన టీమిండియా!
అట్టర్ ఫ్లాప్ అయిన శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్... హాఫ్ సెంచరీ చేసుకున్న ఇషాన్ కిషన్..

115 పరుగుల స్వల్ప లక్ష్యం. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ప్రిపరేషన్స్‌గా భావిస్తున్న సిరీస్ కావడంతో కుర్రాళ్లను పరీక్షించాలని డిసైడ్ అయిన టీమిండియాకి ఓ రకంగా షాక్ ఇచ్చారు భారత యంగ్ బ్యాటర్లు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఎవ్వరూ పెద్దగా ఆకట్టు కోలేకపోయారు.. 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి తొలి వన్డేలో విజయాన్ని అందుకుంది టీమిండియా..
ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన శుబ్‌మన్ గిల్, 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి జేడన్ సీల్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, మోతీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, రనౌట్ అయ్యాడు. 46 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... వన్డేల్లో నాలుగో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
46 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, మోతీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ 1 పరుగు చేసి కరియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 97 పరుగులకే సగం టీమ్, పెవిలియన్‌కి చేరింది. ఇక లాభం లేదనుకుని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ..
2011లో వన్డేల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రోహిత్ శర్మ, మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఈ పొజిషన్‌లో బ్యాటింగ్‌కి రావడం విశేషం. రవీంద్ర జడేజా 16, రోహిత్ శర్మ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమ్‌కి విజయాన్ని అందించారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు, 23 ఓవర్లలోనే 114 ఆలౌట్ అయిపోయింది.. 9 బంతుల్లో 2 పరుగులు చేసిన కైల్ మేయర్స్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన అలిక్ అతనజే, ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్‌ని, శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్..
19 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన హెట్మయర్, రీఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 4 బంతుల్లో ఓ ఫోర్ బాదిన రోవ్‌మెన్ పావెల్ 4 పరుగులు చేసి జడ్డూ బౌలింగ్ అవుట్ కాగా, 2 బంతులు ఆడిన రొమారియో షెఫర్డ్ కూడా, జడేజా బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీ పట్టిన సూపర్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు..
డొమినికా డ్రేక్స్ 3 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. యానిక్ కరియా కూడా 3 పరుగులే చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
45 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన షై హోప్‌ని అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్, అదే ఓవర్‌లో జేడన్ సీల్స్‌ని డకౌట్ చేయడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది..
3 ఓవర్లలో 2 మెయిడిన్లతో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగట్టాడు కుల్దీప్ యాదవ్. రవీంద్ర జడేజాకి 3 వికెట్లు దక్కగా శార్దూల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యా, ముకేశ్ కుమార్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.