Asianet News TeluguAsianet News Telugu

అంపైర్‌తో గొడవ పెట్టుకున్న రాహుల్ చాహార్... సఫారీ పర్యటనలో ఉన్న లెగ్ స్నిన్నర్‌కి...

సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత్-A జట్టులో రాహుల్‌కి అవకాశం... మొదటి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించిన రాహుల్ చాహార్, అసహనానికి లోనై, అంపైర్‌తో వాగ్వాదం...

India A tour of South Africa: Rahul Chahar losses temper and argue with Umpire match against South Africa-A
Author
India, First Published Nov 26, 2021, 1:26 PM IST

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి వచ్చిన స్పిన్నర్ రాహుల్ చాహార్. భారత సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ని కాదని, యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి రాహుల్ చాహార్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు. ఐపీఎల్ ద్వారా వచ్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడు మ్యాచులు ఆడినా ఒక్క వికెట్ తీయలేకపోతే, రాహుల్ చాహార్‌కి నమీబియాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది...

Also Read: ఆ కారణంగానే ఆ జట్టు నుంచి బయటికి శ్రేయాస్ అయ్యర్... ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీరే...

పసికూనతో జరిగిన మ్యాచ్‌లోనూ పెద్దగా ఇంప్రెస్ చేయలేక, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి దూరమయ్యాడు రాహుల్ చాహార్. అయితే సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న భారత్-A జట్టులో రాహుల్‌కి అవకాశం దక్కింది...

సౌతాఫ్రికా-A తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రాహుల్ చాహార్ చేసిన ఓ పని, చర్చనీయాంశమైంది. టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా-A జట్టు, 509/7 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సరెల్ ఎర్వీ, వాన్ టండర్ డకౌట్ అయినా కెప్టెన్ పీటర్ మలాన్, టోనీ డి జోర్జీ కలిసి మూడో వికెట్‌కి 217 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. పీటర్ మలన్ 19 ఫోర్లతో 163 పరుగులు చేయగా, టోనీ 18 ఫోర్లతో 117 పరుగులు చేశాడు...

జే స్మిత్ 52, క్విషిల్ 72, జార్జ్ లిండే 51 పరుగులతో రాణించడంతో రాహుల్ చాహార్ 28.3 ఓవర్లలో 125 పరుగులు సమర్పించుకుని, ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహార్ బౌలింగ్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు...

దీంతో తీవ్ర అసహనానికి గురైనట్టు కనిపించిన రాహుల్ చాహార్, క్విషెల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేశాడు. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో అసహనానికి గురైన రాహుల్ చాహార్, ‘కాళ్లకు తగులుతుంటే లైన్ కనిపించడం లేదా?’ అంటూ వాగ్వాదానికి దిగాడు...

భారత బౌలర్లలో నవ్‌దీప్ సైనీ 2, నాగస్‌వాలా 2 వికెట్లు తీయగా సన్‌రైజర్స్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ 21 ఓవర్లలో 90 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. అయితే భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి, రాహుల్ చాహార్‌ని వారించి, బౌలింగ్ చేయాల్సిందిగా సూచించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా  509/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది భారత్-A జట్టు.

పృథ్వీ షా 45 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ ప్రియాంక్ పంచల్ 171 బంతుల్లో 14 ఫోర్లతో 96 పరుగులు, అభిమన్యు ఈశ్వరన్ 209 బంతుల్లో 103 పరుగులు, హనుమ విహారి 53 బంతుల్లో 6 ఫోర్లతో 25 పరుగులు చేసి అవుట్ అయ్యారు. బాబా అపరాజిత్ 19, ఉపేంద్ర యాదవ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు...

నాలుగు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్‌లో ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో తొలి టెస్టు డ్రాగా ముగిసే అవకాశమే ఎక్కువగా ఉంది. 

Read Also: గంగూలీ కంటే దారుణంగా అజింకా రహానే ఫామ్... టీమిండియా టెస్టు టెంపరరీ కెప్టెన్‌పై...

Follow Us:
Download App:
  • android
  • ios