కటక్‌లో నరాలు తెగె ఉత్కంఠ మధ్య జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. విండీస్ విధించిన 316 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ 63, లోకేశ్ రాహుల్ 77 శుభారంభాన్ని అందించారు.

అయితే మధ్యలో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి వరుసగా వికెట్లు తీశారు. అయితే కోహ్లీ 85, రవీంద్ర జడేజా 39 ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివర్లో శార్థూల్ సాయంతో జడేజా లాంఛనాన్ని పూర్తిచేశాడు.వెస్టిండీస్ బౌలర్లలో కీమో పాల్ 3 వికెట్లు పడగొట్టాడు. 

విజయానికి అడుగు దూరంలో విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీమో పాల్ బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. విజయానికి భారత్ ఇంకా 25 పరుగుల దూరంలో ఉంది. 

విండీస్ బౌలర్ల ధాటికి టీమిండియా మిడిలార్డర్ కుప్పకూలింది. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కాట్రెల్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. కెప్టెన్ కోహ్లీపైనే అందరి ఆశలు ఉన్నాయి. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థసెంచరీ సాధించాడు. నిలకడగా ఆడిన అతను 53 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

లక్ష్యఛేదనలో టీమిండియా కష్టాల్లో పడింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ రిషభ్ పంత్.. కీమో పాల్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడి క్లీన్ బౌల్డయ్యాడు. 

టీమిండియా స్వల్ప వ్యవధిలో మూడో వికెట్‌ను కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీమో పాల్ బౌలింగ్‌లో జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోసెఫ్ బౌలింగ్‌లో షై హోప్‌కు క్యాచ్ ఇచ్చి లోకేశ్ రాహుల్ ఔటయ్యాడు. 

భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. జోరు మీదున్న రోహిత్ శర్మ 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హోల్డర్ బౌలింగ్‌లో షైహోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

టీమిండియాకు మరోసారి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్, రోహిత్‌ శర్మ అర్థసెంచరీలు పూర్తి చేశారు. రాహుల్ 49 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అటు రోహిత్ శర్మ సైతం 52 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అర్థ సెంచరీ చేశాడు.

కటక్ వన్డేలో వెస్టిండిస్ టీమిండియా ముందు 316 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు తొలుత కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రావడం కష్టమైంది. అయితే పూరన్ 89, పొలార్డ్ 74 పరుగులతో బ్యాట్ ఝళిపించడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నవదీప్ షైనీ 2, శార్థూల్, షమీ, జడేజా తలో వికెట్ పడగొట్టారు. 

కెప్టెన్ పొలార్డ్ అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. పూరన్‌తో కలిసి ఇన్నింగ్సును చక్కదిద్దిన పొలార్డ్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇందులో 4 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. 

ఇన్నింగ్స్‌కు వెన్నెముకలో నిలబడి.. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన నికోలస్ పూరన్ ఎట్టకేలకు ఔటయ్యాడు. ఎస్ఎన్ ఠాకూర్ బౌలింగ్‌లో 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్‌కు యత్నించిన పూరన్..  రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

పూరన్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ పొలార్డ్‌తో కలిసి జట్టు ఇన్నింగ్సును నిలబెట్టిన పూరన్ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

వెస్టిండీస్‌ స్వల్ప వ్యవధిలో మరో కీలక వికెట్ కోల్పోయింది. హెట్మేయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన రోస్టన్ ఛేజ్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నవదీప్ షైనీ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

విధ్వంసక వీరుడు హెట్మేయర్‌ను త్వరగానే భారత బౌలర్లు పెవిలియన్‌కు పంపారు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించిన హెట్మేయర్ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నవదీప్ షైనీ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ప్రమాదకర షైహోప్‌ను షమీ బొల్తా కొట్టించాడు. 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన షైహోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఎట్టకేలకు భారత బౌలర్లు విండీస్ ఓపెనింగ్ జోడినీ విడగొట్టారు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎవిన్ లూయిస్.. నవదీప్ షైనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 57 పరుగుల తొలి  వికెట్ భాగస్వామ్యానికి తెరపడినట్లయ్యింది. 

కటక్: నిర్ణయాత్మకమైన మూడో వున్డే లో టాస్ నెగ్గి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో చాహర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో... నవదీప్ సైనీకి అవకాశం దక్కింది. నేటి మ్యాచులో అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అతను ఆరంగ్రేటం చేస్తున్నాడు. బహుశా కోహ్లీ తన ఆర్సీబీ జట్టు బౌలింగ్ డెప్త్ ను కూడా పరీక్షించుకుంటున్నారు కాబోలు. 

కటక్‌లో చివరగా జరిగిన వన్డేలో పరుగుల వరద పారింది. 350 ప్లస్‌ స్కోర్లు నమోదయ్యాయి. నేడు వెస్టిండీస్‌తో వన్డేకు అటువంటి పిచ్‌నే సిద్ధం చేశారు. రాత్రి వేళ మంచు కురుస్తుంది. టాస్‌ నెగ్గిన తొలుత బౌలింగ్‌ చేయడానికి ఇష్టపడనుంది. కటక్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. మ్యాచ్‌కు ఎటువంటి వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ చెబుతోంది. అనువైన వాతావరణంలో నేడు కటక్‌లో పరుగుల వాన కురువనుంది!.  

స్వదేశంలో టీమ్‌ ఇండియా దశాబ్దన్నర కాలంగా తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది. సొంత అభిమానుల నడుమ భారత్‌ వరుసగా రెండు వన్డే సిరీస్‌లో కోల్పోయి 15 వసంతాలు పూర్తయ్యాయి. 

మరోవైపు భారత గడ్డపై వన్డే సిరీస్‌ విజయం అందుకుని కరీబియన్‌ బృందానికి ఇంచుమించు అంతే కాలమైంది. వెస్టిండీస్‌పై వరుసగా పదో వన్డే సిరీస్‌ విజయం కోసం కోహ్లిసేన ఉత్సాహంగా అడుగులు వేస్తుండగా, చాన్నాండ్ల తర్వాత అందివచ్చిన సిరీస్‌ విజయావకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో విండీస్‌ నిమగమైంది. 

గతంలో కటక్‌లో జరిగిన వన్డేల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. భారత్‌ 381/6 చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్‌ 366/8 భారీగానే స్కోరు చేసింది. భారత్‌, వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌లు దూకుడుగా రాణిస్తున్నారు. దీంతో కటక్‌లో మళ్లీ భారీ స్కోర్ల థ్రిల్లర్‌ ఎదురుచూస్తోంది. మెరుగైన బౌలింగ్‌ బృందం సిరీస్‌ విజేతను నిర్ణయించగలదు.