IND vs WI : రేపే వైజాగ్ వన్డే... గెలిచేదెవరంటే!
చెన్నై లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలవ్వడంతో, మిగతా రెండు వన్డేల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తేనే సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకుంటుంది. అయితే ఈ సిరీస్‌కు కీలకమైన రెండో వన్డే విశాఖ వేదికగా బుధవారం తలపడనుంది.
2007 నుంచి ఇప్పటి వరకూ వెస్టిండీస్‌తో భారత్ వరుసగా తొమ్మిది వన్డే సిరీస్‌లలో విజయం సాధించింది. ఇప్పుడు జరుగుతున్న పదో సిరీస్‌లో విజయం సాధిస్తే వరుస విజయాలు సాధించిన జట్టుగా కోహ్లీసేన రికార్డు నెలకొల్పనుంది.
చెన్నై లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలవ్వడంతో, మిగతా రెండు వన్డేల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తేనే సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకుంటుంది. అయితే ఈ సిరీస్‌కు కీలకమైన రెండో వన్డే విశాఖ వేదికగా బుధవారం తలపడనుంది.
దీనికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే పూర్తిచేశారు. తొలి వన్డేలో ఓటమి చెందడంతో భారత్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. రానున్న రెండు వన్డేల్లోనూ కచ్చితంగా గెలవాలన్న ఒత్తిడి వారిలో కనిపిస్తుంది.
విశాఖపట్నం మధురవాడ సమీపంలోని ఎసిఎ-విడిసిఎ మైదానంలో రేపు 18న భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియం జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
గతంలో మ్యాచ్‌లు జరిగినప్పుడు అక్కడ వెయ్యి మంది పోలీసు సిబ్బందిని నియమించగా.. ఇప్పుడు ఎక్కువ మందిని నియమించాలని భావిస్తోంది. గ్యాలరీల్లో కుర్చీలకు నంబరింగ్ పనులు పూర్తి చేశారు. అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ప్రేక్షకులను నియంత్రించడానికి బారికేడ్లు సిద్ధం చేశారు.
Also read: భారత్VS వెస్టిండీస్.. స్పిన్నర్ల చెత్త రికార్డ్
గేట్ నంబర్లు, స్టాండ్ల వివరాలు తెలిపే సైన్ బోర్డులు తయారయ్యాయి. క్రీడాకారుల సిట్‌రూమ్, డ్రెస్సింగ్‌రూమ్, జిమ్ తదితర వాటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. డే అండ్ నైట్ మ్యాచ్ జరగనుండటంతో ముందు జాగ్రత్తగా అత్యవసర వినియోగానికి అవసరమైన అధిక సామర్ధ్యం ఉన్న జనరేటర్లను సిద్ధం చేస్తున్నారు.
స్టేడియం నలువైపులా ఉన్న ఫ్లడ్ లైట్లను పరిశీలించి పాడైన వాటి స్థానంలో కొత్తవి అమర్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల టిక్కెట్లు 85 శాతం విక్రయించేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
భారత్‌కు మరోసారి విశాఖ కలిసొచ్చేనా.?
భారత్ జట్టు ఇప్పటి వరకూ ఈ మైదానంలో 11 వన్డేలు ఆడగా 9 వన్డేల్లో విజయం సాధించింది. గతేడాది అక్టోబరు 24న భారత్ ఈ స్టేడియంలో ఆడిన మ్యాచులో ఓటమి చెందింది. అది కూడా విండీస్ చేతిలోనే!
ఇప్పుడు మరోసారి ప్రత్యర్థి వెస్టిండీస్ టీమే అవడం, తొలి మ్యాచ్‌లో ఓటమి చెందడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే భారత్‌కు బాగా కలిసొచ్చే మైదానంగా విశాఖకు పేరుండటంతో కచ్చితంగా ఇక్కడ జరగనున్న రెండో వన్డేలో భారత్ గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.
వైజాగ్ చేరుకున్న క్రీడాకారులు.. ప్రారంభమైన నెట్ ప్రాక్టీస్
ఇరుజట్ల క్రీడాకారులు సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి భారత్-వెస్టిండీస్ క్రీడాకారులు వేర్వేరు బస్సుల్లో నోవాటెల్‌కు చేరుకుని అక్కడ బస చేశారు. మంగళవారం ఉదయం ఎసిఎ-విడిసిఎ మైదానం 'బి'లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వెస్టిండీస్ జట్టు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకూ భారత జట్టు నెట్ ప్రాక్టీస్ చేయనుంది.