Asianet News TeluguAsianet News Telugu

ఇండియా వర్సెస్ శ్రీలంక : టీ20 సిరీస్, వన్డే సిరీస్ లకు వేర్వేరు జట్లను ప్రకటించిన బీసీసీఐ..

శ్రీలంకతో జరగనున్న ఇండియా వన్డే, టీ20 సిరీస్ లకు భారత జట్టులో మార్పులు చేసింది బీసీసీఐ. రెండు ఆటలకు వేర్వేరుగా జట్టును ప్రకటించింది. 

IND vs SL : BCCI announces different squads for Sri Lanka vs India's T20I and ODI series
Author
First Published Dec 28, 2022, 8:16 AM IST

శ్రీలంకతో ఇండియాలో ఇండియా వర్సెస్ శ్రీలంక టీ20, వన్డే సిరీస్ మ్యాచ్ లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లకు గానూ మంగళవారం బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. భారత్ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను ఈ సిరీస్ నుంచి తొలగించారు. అతనితో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లు కడా శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ లో ఆడడం లేదు. లంకతో జరిగే ఈ టీ20 సిరీస్ కు ఎంపికైన జట్టుకు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉంటాడు. జట్టులో కొత్త వారికి స్థానం దక్కింది. ముఖేష్ కుమార్, శివమ్ మావి అనే ఇద్దరు యువ ఫేసర్లు మొదటిసారిగా భారత్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. హార్థిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ ను కూడా లక్ నాక్ చేసింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ సిరీస్ కు భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఎంచుకుంది.

భారత్ వర్సెస్ లంక టీ 20 సిరీస్ మ్యాచ్ జనవరి 3న ప్రారంభమవుతుంది. ముంబై వేదికగా జరుగుతుంది. భారత వన్డే క్రికెట్ జట్టు విషయంలోనూ బీసీసీఐ మార్పులు చేసింది. వైస్ కెప్టెన్ స్థానం నుంచి కేఎల్ రాహుల్ ను తీసేసి.. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించింది. వన్డే సిరీస్ జట్టుకు వచ్చేసరికి.. లంకతో జరిగే టీ 20 సిరీస్ మ్యాచ్ కు దూరమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు ఇందులో ఉన్నారు. అయితే, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు వన్డే జట్టులో స్థానం దక్కలేదు. ఇకపోతే.. మరో ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ది కూడా అదే పరిస్థితి. అతనికి టీ20, వన్డే రెండు జట్టుల్లోనూ స్థానం దక్కలేదు. 


టి20 సిరీస్ భారత జట్టు
కెప్టెన్         -    హార్దిక్ పాండ్యా
వైస్ కెప్టెన్        -     సూర్య కుమార్  యాదవ్ 
వికెట్ కీపర్     -     ఇషాన్ కిషన్ 

మిగతా టీం మెంబర్స్
రాహుల్ త్రిపాఠి
రుతురాజ్ గైక్వాడ్
దీపక్ హుడా 
వాషింగ్టన్ సుందర్
సంజూ శాంసన్
అక్షర్ పటేల్ 
యుజ్వేంద్ర చాహల్
అర్ష్ దీప్ సింగ్
హర్షల్ పటేల్ 
ఉమ్రాన్ మాలిక్
శివం మావి
ముఖేష్ కుమార్ 


వన్డే సిరీస్కు ఎంపికైన భారత జట్టు..
కెప్టెన్         -    రోహిత్ శర్మ
వైస్ కెప్టెన్        -    హార్దిక్ పాండ్యా 
వికెట్ కీపర్     -    ఇషాన్ కిషన్

మిగతా టీం మెంబర్స్
విరాట్ కోహ్లీ
సూర్యకుమార్ యాదవ్
శుభమన్ గిల్ 
శ్రేయస్ అయ్యర్
కె.ఎల్.రాహుల్ 
యుజ్వేంద్ర చాహల్
కుల్దీప్ యాదవ్
అక్షర్ పటేల్
మొహమ్మద్ సిరాజ్
మొహమ్మద్ షమీ
అర్ష్ దీప్ సింగ్
ఉమ్రాన్ మాలిక్

Follow Us:
Download App:
  • android
  • ios