IND vs PAK: వన్డే వరల్డ్ కప్‌లోనే హై-ఓల్టేజీ మ్యాచ్.. షాక్ కొట్టేలా టికెట్ ధర..
India Vs Pakistan: వన్డే ప్రపంచ కప్ 2023 లో హై వోల్టేజ్ భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు సెకండరీ మార్కెట్లో అభిమానులకు షాక్ ఇస్తూ.. తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఏకంగా టిక్కెట్టు ధరలు లక్షల్లో ఉండటంతో పాటు కొన్ని టికెట్ల ధరలు రూ.50 లక్షలకు పైగా ఉండటంతో అసలు ఏం జరుగుతోంది అంటూ అభిమానులు షాక్ లో ప్రశ్నిస్తూనే విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు.
ODI World Cup 2023: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగబోయే హై వోల్టేజ్ పోరుపై ఆసక్తి నెలకొంది. ఆగస్టు 29, సెప్టెంబర్ 3 తేదీల్లో కేవలం గంట వ్యవధిలోనే ప్రైమరీ టికెట్ సేల్స్ అవుట్లెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఇక సెకండరీ మార్కెట్‌లో అయితే, టికెట్ ధరలు చుక్కలనంటాయి. దీంతో అభిమానులు షాక్ గురవుతున్నారు. ఇదే సమయంలో అభిమానుల నుంచి విమర్శలతో పాటు ట్రోలింగ్ మొదలైంది.
వివరాల్లోకెళ్తే.. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగబోయే హై వోల్టేజ్ పోరుపై ఆసక్తి నెలకొంది. ఆగస్టు 29, సెప్టెంబర్ 3 తేదీల్లో కేవలం గంట వ్యవధిలోనే ప్రైమరీ టికెట్ సేల్స్ అవుట్లెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. అయితే, టిక్కెట్ల అమ్మకాల సెకండరీ మార్కెట్లో కూడా గణనీయమైన డిమాండ్ తో ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు, సౌత్ ప్రీమియం ఈస్ట్ 3 సెక్షన్ టికెట్ ప్రస్తుతం ఆన్ లైన్ స్పోర్ట్స్ టికెట్ ప్లాట్ ఫామ్ వియాగోగోలో విస్మయానికి గురిచేస్తూ ఏకంగా రూ .21 లక్షలుగా జాబితా చేయబడింది. అలాగే, అప్పర్ టైర్‌లోని రెండు టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా చూపిస్తుండగా, వాటి ఒక్కో టికెట్ ధర రూ.57 లక్షలకు పైగా ఉండటం గమనార్హం.
క్రికెట్ అభిమానులను షాక్ గురిచేస్తున్న ఈ టిక్కెట్టు ధరలపై సోషల్ మీడియా యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టిక్కెట్లు విక్రయిస్తున్న ఈ సెకండరీ మార్కెట్ పై విమర్శలు, ట్రోల్స్ మొదటయ్యాయి. ఒక నెటిజన్ ఈ టిక్కెట్ ధరలపై స్పందిస్తూ.. "ఏం జరుగుతోంది? వియాగోగో వెబ్ సైట్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ల వరల్డ్ కప్ టికెట్లు రూ.65,000 నుంచి 4.5 లక్షల వరకు ఉన్నాయి. ఈ సంస్థలు పట్టపగలే దోపిడి చేస్తున్నారా ! '' అని కామెంట్ చేశాడు. మరో యూజర్.. '#INDvPAK ప్రపంచకప్ మ్యాచ్ కోసం వియాగోగోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ధరలను చూడండి' అని మరో యూజర్ కామెంట్ చేస్తూ స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడు. ఇలా క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఐసీసీ, బీసీసీఐలను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. టిక్కెట్టు విక్రయ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.