విరాట్ రికార్డును సమం చేసిన కేఎల్ రాహుల్..!
విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. గతంలో ఇదే రికార్డు కోహ్లీ పేరిట ఉండగా, దానిని ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా సమం చేశాడు. కోహ్లీ, రాహుల్ ఇద్దరూ ఒకే ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2023 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి వచ్చిన భారత వికెట్ కీపర్-బ్యాటర్ KL రాహుల్ ఆదివారం ODI ఫార్మాట్‌లో 2000 పరుగులు పూర్తి చేశాడు. ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, రాహుల్ కేవలం 53 ఇన్నింగ్స్‌లలో 2000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు, విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. గతంలో ఇదే రికార్డు కోహ్లీ పేరిట ఉండగా, దానిని ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా సమం చేశాడు. కోహ్లీ, రాహుల్ ఇద్దరూ ఒకే ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.
అయితే, వన్డేల్లో మరింత వేగంగా 2,000 పరుగులకు చేరుకోవడంతో ఈ జాబితాలో మొదటి మూడు స్థానాలను క్లెయిమ్ చేసిన ముగ్గురు భారతీయులు ఉన్నారు. కేవలం 48 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని సాధించిన వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉండగా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బ్యాటర్ నవజోత్ సిద్ధూ కూడా 52 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు.
ఇదిలా ఉండగా, ఆసియా కప్ లో భాగంగా నిన్న టీమిండియా , పాకిస్తాన్ తో తలపడింది. అయితే, ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలో ఆగిపోయింది. ఈ మ్యాచ్ మళ్లీ ఎక్కడ ఆగిందో, అక్కడి నుంచి ప్రారంభం కానుంది. మరి, ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.