420 పరుగుల భారీ లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా... 25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్ ఆరు పరుగులకే అవుటై నిరాశపరిచిన రోహిత్ శర్మ, మరోసారి ఫెయిల్ అయ్యాడు. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ.

20 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, జాక్ లీచ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారీ లక్ష్యచేధనను దూకుడుగా ప్రారంభించింది టీమిండియా. యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 13 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, ఆ తర్వాతి ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 178 పరుగులకి ఆలౌట్ చేసింది టీమిండియా. ఫలితంగా భారత జట్టు గెలవాలంటే నాలుగో ఇన్నింగ్స్‌లో 420 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ కారణంగా 105 పరుగులు సమర్పించుకున్న జాక్ లీచ్, రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ తీయడం విశేషం.