ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.. 48 బంతుల్లో 11 పరుగులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... డామ్ బెస్ బౌలింగ్‌లో ఓల్లీ పోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు.

గత నాలుగేళ్లలో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ కావడం ఇదే తొలిసారి. విరాట్ కోహ్లీ అవుటైన వెంటనే అజింకా రహానే కూడా డామ్ బెస్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఆరు బంతుల్లో ఒకే పరుగు చేసిన రహానే, రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ స్కోరుకి 500లకు పైగా పరుగులు వెనకబడి ఉంది టీమిండియా.

రోహిత్ శర్మ 6, శుబ్‌మన్ గిల్ 29 పరుగులు చేసి పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 578 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.