చెన్నై టెస్టులో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరుకి 39/1 వద్ద ఐదోరోజు ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా మరో 19 పరుగులు జోడించిన తర్వాత పూజారా వికెట్ కోల్పోయింది. 38 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కోల్పోయిన రెండు వికెట్లు జాక్ లీచ్ బౌలింగ్‌లోనే కావడం విశేషం. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ 60 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది టీమిండియా.

భారత జట్టు విజయానికి ఇంకా 362 పరుగులు కావాలి. భారత సారథి విరాట్ కోహ్లీ రాణించడంపైనే ఫలితం ఆధారపడి ఉంది.