బెగంళూర్: భారత్ తో బెంగళూరులో ఆదివారం జరిగిన వన్డే మ్యాచులో మిచెల్ స్టార్క్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. రెగ్యులర్ స్లాట్ లో కాకుండా అతన్ని కాస్తా ముందుగా బ్యాటింగ్ కు దించారు. హిట్టింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు ఆ పని చేశారు. అయితే, ఆస్ట్రేలియా వ్యూహం బెడిసికొట్టింది. 

స్టార్క్ కేవలం మూడు బంతులు ఆడి సున్నా పరుగులకే చుట్టేశాడు. రవీంద్ర జడేజా వేసిన 36వ ఓవరు ఆఖరి బంతికి సబ్ స్ట్యూట్ ఫీల్డర్ చాహల్ క్యాచ్ పట్టడంతో స్టార్క్ పెవిలియన్ చేరుకున్నాడు. అదే ఓవరులో అంతకు ముందు లబూ షేన్ అవుటయ్యాడు. దాంతో హిట్టింగ్ కోసం స్టార్క్ ను ముందుగా బ్యాటింగ్ కు పంపించారు. 

Also Read: అందుకే ఓడిపోయాం: మూడో వన్డే ఫలితంపై ఆరోన్ ఫించ్

బ్యాటింగ్ ఆర్డర్ మార్చి స్టార్క్ ను ముందు బ్యాటింగ్ కు పంపించిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యూహం విఫలమైంది. అయితే, స్టార్క్ అవుటైన తీరుపై ఆయన భార్య అలీసా హేలీ కూడా ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలైన అలీసా హేలీ... ఇదేమీ బ్యాటింగ్ భర్త గారూ అనే అర్థం వచ్చే విధంగా ఒక ఎమెజీని పోస్టు చేసింది. 

అలీసా పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు దానిపై స్పందిస్తున్నారు. మేడమ్.. మీరు చెప్పన బ్యాటింగ్ టెక్నిక్ ను స్టార్క్ మరిచిపోయాడమో అని ఒకరు స్పందించగా, బ్యాటింగ్ ఏలా చేయాలో స్టార్క్ కు నేర్పించడని మరొకరు అన్నారు. 

Also Read: మ్యాచ్ రివ్యూ: బాకీ తీర్చుకున్న రోహిత్... లెక్క సరిచేసిన కోహ్లీ

ఓ మైగాడ్ .. స్టార్క్ బ్యాటింగ్ చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నామని మరొకరు ట్వీట్ చేశారు. ఈ మ్యాచును భారత్ 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. దాంతో ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్ ను సొంతం చేసుకుంది.