ఆఫ్ఘ‌నిస్తాన్ బౌలింగ్ ను ఉతికిపారేసిన య‌శ‌స్వి జైస్వాల్, శివ‌మ్ దుబే.. భారత్ గెలుపు, సిరీస్ కైవసం

IND vs AFG 2nd T20I: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య 2వ టీ20 మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్.. భారత్ ముందు 173 టార్గెట్ ఉంచింది. యశస్వి జైస్వాల్, శివమ్ దుబేలు ఆఫ్ఘ‌నిస్తాన్ బౌలింగ్ ను ఉతికిపారేశారు.  
 

IND vs AFG: Yashaswi Jaiswal, Shivam Dube destroy Afghanistan's bowling, Both the players scored half-centuries, india win

India vs Afghanistan 2nd T20: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య 2వ టీ20 మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ భారత్ ముందు 173 పరుగుల టార్గెట్ ఉంచింది. మరోసారి రోహిత్ శ‌ర్మ నిరాశ‌ప‌ర్చ‌గా, విరాట్ కోహ్లీ చిన్న ఇన్నింగ్స్ తో (29 ప‌రుగులు) రాణించాడు. ఇక యంగ్స్ ప్లేయ‌ర్స్ , భార‌త ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఆఫ్ఘ‌నిస్తాన్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. అలాగే, భార‌త ఆల్ రౌండ‌ర్ శివ‌మ్ దుమే హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో బౌల‌ర్ల‌కు  చుక్క‌లు చూపించాడు. ఇద్ద‌రు హాఫ్ సెంచ‌రీలు సాధించి భారత్ కు విజయం అందించారు. రెండో మ్యాచ్ గెలిచిన భారత్ 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.  

 

యశస్వి జైస్వాల్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. శుభ్ మన్ గిల్ ను టీం నుంచి తప్పించి తుదిజట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమని నిరూపించాడు. అద్భుతమైన షాట్స్ కొట్టాడు. 34 బంతుల్లో జైస్వాల్ 68 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 6 సిక్స‌ర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. భారత్ రెండు భారీ వికెట్లు కోల్పోయినా స్కోరింగ్ రేట్ తగ్గలేదు. శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శివ‌మ్ దూబే 22 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఈ సిరీస్ లో శివ‌మ్ దుబేకు రెండో హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం. 

IND vs AFG: టీ20ల్లో ఒకే ఒక్క‌డు.. 150వ మ్యాచ్ తో రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డు

 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన‌ అఫ్ఘన్ టీమ్ 20 ఓవ‌ర్ల‌లో 172 పరుగులకు ఆలౌట్ అయింది. గుల్బాదిన్ నబీ 57 పరుగులతో రాణించాడు. నజీబుల్లా జద్రాన్ 23 పరుగులు, కరీం జనత్ 20, ముజీబ్ ఉర్ రెహమాన్ 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, అక్ష‌ర్ ప‌టేల్ 2, ర‌వి బిష్ణోయ్ 2, శివం దుబే 1 వికెట్ తీసుకున్నాడు. భారత్ ముందు 173 టార్గెట్ ఉంచింది. అయితే, ఛేజింగ్ కు దిగిన భార‌త్ కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. ఎలాంటి ప‌రుగులు చేయ‌కుండానే భారీ షాట్ ఆడ‌బోయి ఔట్ అయ్యాడు. కింగ్ విరాట్ కోహ్లీ 29 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. జితేష్ శ‌ర్మ డ‌కౌట్ గా వెనుదిరిగాడు. శివ‌మ్ దుబే, య‌శ‌స్వి జైస్వాల్ ఇద్ద‌రు ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ల‌ను చీల్చిచెండాడారు. శివ‌మ్ దూబే 63 ప‌రుగులు, రింకూ సింగ్ 9 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు. భార‌త్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 

IND vs AFG: డ‌బుల్ సెంచ‌రీ వికెట్లు.. టీ20ల్లో అక్ష‌ర్ ప‌టేల్ స‌రికొత్త రికార్డు..

భార‌త్ వికెట్ల ప‌త‌నం: 5-1 ( రోహిత్ శర్మ , 0.5), 62-2 ( విరాట్ కోహ్లీ , 5.3), 154-3 ( యశస్వి జైస్వాల్ , 12.3), 156-4 ( జితేష్ శర్మ , 12.6)

అఫ్ఘనిస్తాన్ వికెట్ల ప‌త‌నం: 20-1 ( గుర్బాజ్ , 2.2), 53-2 ( ఇబ్రహీం జద్రాన్ , 5.4), 60-3 ( అజ్మతుల్లా , 6.5), 91-4 ( గుల్బాదిన్ , 11.3), 104-5 ( నబీ , 14.2), 134-6 ( నజీబుల్లా , 17.1), 164-7 ( కరీం జనత్ , 19.1), 170-8 ( నూర్ అహ్మద్ , 19.5), 171-9 ( ముజీబ్ , 19.5), 172-10 ( ఫజల్హక్ ఫరూఖీ , 20)

India vs Afghanistan: మ‌ళ్లీ నిరాశపరిచిన రోహిత్ శ‌ర్మ‌.. ఇలా అయితే కష్టమే.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios