Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: భారత్ జైత్రయాత్ర.. వందేమాతరంతో దద్దరిల్లిన మైదానం.. అద్భుతమైన లైట్ షో (వీడియో)..

వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఆదివారం లక్నోలో జరిగిన మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుపై 100 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్‌.. వన్డే వరల్డ్ కప్‌‌ 2023లో వరుసగా ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

icc world cup 2023 Watch Fans sing Vande Mataram along with dazzling light show after India WC win over England ksm
Author
First Published Oct 30, 2023, 10:03 AM IST | Last Updated Oct 30, 2023, 10:03 AM IST

వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఆదివారం లక్నోలో జరిగిన మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుపై 100 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్‌.. వన్డే వరల్డ్ కప్‌‌ 2023లో వరుసగా ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో భారత జట్టు సెమీస్ ఎంట్రీ దాదాపుగా ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన బ్యాటింగ్ జట్టును ఆదుకోగా.. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు అద్భుతమైన బౌలింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. 

ఈ అద్భుతమైన విజయం తర్వాత భారత అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. దీంతో స్టేడియంలో భారత విజయం సాధించగానే అభిమానులంతా ‘‘వందేమాతరం’’ ఆలపించారు. ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన లైట్ షో కూడా  అభిమానులను ఉర్రూతలూగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతంసోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూస్తున్నవారికి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. 

 

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలో భారత బ్యాటర్లను ఇంగ్లాండ్ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. దీంతో 12 ఓవర్లలో జట్టు స్కోరు 40/3 మాత్రమే. ఆ తర్వాత రోహిత్ , కేఎల్ రాహుల్ 91 పరుగుల భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. రోహిత్ శర్మ 87, సూర్యకుమార్ యాదవ్ 49, కెఎల్ రాహుల్ 39 పరుగులు చేసి భారత జట్టుకి మంచి స్కోరు అందించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి  229 పరుగుల స్కోరు చేయగలిగింది.

ఆ 230 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్, 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ని జస్ప్రిత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి జో రూట్ కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జో రూట్ డీఆర్‌ఎస్ తీసుకున్నా, టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు క్లియర్‌గా కనిపించడంతో నిరాశ తప్పలేదు. 10 బంతులు ఆడిన బెన్ స్టోక్స్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. తన రెండో ఓవర్ చివరి బంతికి బెన్ స్టోక్స్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ, మూడో ఓవర్ తొలి బంతికి జానీ బెయిర్‌స్టోని క్లీన్ బౌల్డ్ చేశాడు. 23 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన బెయిర్‌స్టో, షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

23 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొయిన్ ఆలీ, లియామ్ లివింగ్‌స్టోన్ కలిసి ఆరో వికెట్‌కి 29 పరుగులు జోడించారు. 31 బంతుల్లో 15 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, మహ్మద్ షమీ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన క్రిస్ వోక్స్, జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 46 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

98 పరుగుల వద్ద 8 వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. డేవిడ్ విల్లే, అదిల్ రషీద్ కలిసి 9వ వికెట్‌కి 24 పరుగులు జోడించారు. 20 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన అదిల్ రషీద్‌ని మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. మార్క్‌ వుడ్‌ని జస్ప్రిత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కి తెరబడింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోర్ చేసినప్పటికీ.. 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios