ICC World cup 2023: ఎట్టకేలకు బోణీ కొట్టిన శ్రీలంక... నెదర్లాండ్స్‌పై ఈజీ విజయం..

నెదర్లాండ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో బోణీ కొట్టిన శ్రీలంక... 91 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సధీర సమరవిక్రమ.. 

ICC World cup 2023: Sri Lanka registers 1st win after beating Netherlands CRA

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి మూడు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక ఎట్టకేలకు బోణీ కొట్టింది. క్వాలిఫైయర్స్ నుంచి ప్రపంచ కప్‌కి వచ్చిన నెదర్లాండ్స్‌పై తొలి విజయం అందుకుంది శ్రీలంక.. నెదర్లాండ్స్ విధించిన 263 పరుగుల లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది శ్రీలంక.. 

263 పరుగుల లక్ష్యఛేదనలో లంక ఆదిలోనే షాక్ తగిలింది. 5 పరుగులు చేసిన కుసాల్ పెరేరాని ఆర్యన్ దత్ అవుట్ చేశాడు. 11 పరుగులు చేసిన కెప్టెన్ కుసాల్ మెండిస్ కూడా ఆర్యన్ దత్ బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో 52 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది శ్రీలంక..

ఈ దశలో పథుమ్ నిశ్శంక, సధీర సమరవిక్రమ కలిసి మూడో వికెట్‌కి 52 పరుగులు జోడించారు. 52 బంతుల్లో 9 ఫోర్లతో 54 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, వాన్ మికీరన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చరిత్ అసలంక- సధీర సమరవిక్రమ కలిసి నాలుగో వికెట్‌కి 77 పరుగులు జోడించారు..

66 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన చరిత్ అసలంక, ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నెదర్లాండ్స్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసినా ప్రతీ వికెట్ పడిన తర్వాత భాగస్వామ్యం నిర్మిస్తూ వచ్చిన శ్రీలంక, విజయాన్ని అందుకుంది..

శ్రీలంక విజయానికి ఆఖరి 26 బంతుల్లో 21 పరుగులు కావాల్సి రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. అయితే రెండు సిక్సర్లు బాదిన ధనంజయ డి సిల్వ మ్యాచ్‌లో హై డ్రామా లేకుండా చేశాడు. 37 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వను అకీర్‌మన్ అవుట్ చేశాడు. అయితే అప్పటికే లంక విజయానికి 19 బంతుల్లో 6 పరుగులే కావాలి. 

107 బంతుల్లో 7 ఫోర్లతో 91 పరుగులు చేసిన సధీర సమరవిక్రమ నాటౌట్‌గా నిలవగా హేమంత ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్, 49.5 ఓవర్లలో 262 పరుగులకి ఆలౌట్ అయ్యింది.  విక్రమ్‌జీత్ సింగ్ 4, మ్యాక్స్ ఓడాడ్ 16, కోలిన్‌ అకీర్‌మన్ 29, బస్ దే లీడే 6, తేజ నిడమదురు 9, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 16 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ అయ్యారు. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్, 150+ స్కోరు కూడా చేయడం కష్టమేనని అనిపించింది..

అయితే సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగన్ వాన్ బ్రీక్ కలిసి ఏడో వికెట్‌కి 130 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 82 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 70 పరుగులు చేసిన సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, దిల్షాన్ మదుశనక బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..  వాన్ దేర్ మెర్వీ 7 పరుగులు చేసి అవుట్ కాగా 75 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన లోగన్ వాన్‌ బ్రీక్‌ని రజిత అవుట్ చేశాడు..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios