Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: తడబడి, నిలబడి... శ్రీలంక ముందు మంచి టార్గెట్ పెట్టిన నెదర్లాండ్స్...

Sri Lanka vs Netherlands: 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్, ఏడో వికెట్‌కి 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగన్ వాన్ బ్రీక్... 

ICC World cup 2023: Logan van Beek , Sybrand Engelbrecht half centuries helped Netherlands vs Sri Lanka CRA
Author
First Published Oct 21, 2023, 2:26 PM IST

సౌతాఫ్రికాపై సంచలన విజయం అందుకున్న నెదర్లాండ్స్ జట్టు, నేడు శ్రీలంకతో మ్యాచ్ ఆడుతోంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇప్పటిదాకా బోణీ చేయని ఒకే ఒక్క జట్టుగా నిలిచిన శ్రీలంక, నేటి మ్యాచ్‌లో అయినా గెలవాలని అనుకుంటోంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్, 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్ అయ్యింది..

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి, ఆ తర్వాత 240+ స్కోరు చేసిన నెదర్లాండ్స్... లంకతో మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ చేసింది. విక్రమ్‌జీత్ సింగ్ 4, మ్యాక్స్ ఓడాడ్ 16, కోలిన్‌ అకీర్‌మన్ 29, బస్ దే లీడే 6, తేజ నిడమదురు 9, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 16 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ అయ్యారు. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్, 150+ స్కోరు కూడా చేయడం కష్టమేనని అనిపించింది..

అయితే సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగన్ వాన్ బ్రీక్ కలిసి ఏడో వికెట్‌కి 130 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 82 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 70 పరుగులు చేసిన సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, దిల్షాన్ మదుశనక బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

లోగన్ వాన్ బ్రీక్ 68 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్‌తో వన్డేల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వాన్ దేర్ మెర్వీ 7 పరుగులు చేసి అవుట్ కాగా 75 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన లోగన్ వాన్‌ బ్రీక్‌ని రజిత అవుట్ చేశాడు.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో నో బాల్‌కి లేని పరుగు కోసం ప్రయత్నించిన మికీరన్ రనౌట్ కావడంతో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ తెరపడింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios