Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: క్లాసిన్ క్లాస్ సెంచరీ... ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ పెట్టిన సౌతాఫ్రికా..

South Africa vs England: హెన్రీచ్ క్లాసిన్ సెంచరీ.. మార్కో జాన్సెన్ కలిసి ఆరో వికెట్‌కి 151 పరుగుల భారీ భాగస్వామ్యం.. 85 పరుగులు చేసిన రీజా హెండ్రిక్స్, 60 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్‌...

ICC World cup 2023: Heinrich Klaasen century,  Jansen, Hendricks, van der Dussen helps SA vs ENG CRA
Author
First Published Oct 21, 2023, 6:05 PM IST | Last Updated Oct 21, 2023, 6:05 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు ఇంగ్లాండ్- సౌతాఫ్రికా మధ్య ముంబైలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది.. రీజా హెండ్రిక్స్, వాన్ దేర్ దుస్సేన్, మార్కో జాన్సెన్ హాఫ్ సెంచరీలు చేయగా హెన్రీచ్ క్లాసిన్ క్లాస్ సెంచరీతో సౌతాఫ్రికాకి భారీ స్కోరు అందించారు.. 

ఇన్నింగ్స్ మొదటి బంతికి ఫోర్ బాదిన క్వింటన్ డి కాక్‌ని రెండో బంతికే రీస్ తోప్లే అవుట్ చేశాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. రస్సీ వాన్ దేర్ దుస్సేన్- రీజా హెండ్రిక్స్ కలిసి రెండో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం జోడించారు..

61 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్‌ని అదిల్ రషీద్ అవుట్ చేశాడు. ఫామ్‌లో లేక వరుసగా విఫలమవుతున్న సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా ప్లేస్‌లో వచ్చిన రీజా హెండ్రిక్స్ హాఫ్ సెంచరీతో మెప్పించాడు..

75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేసిన రీజా హెండ్రిక్స్, అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసిన్ కలిసి నాలుగో వికెట్‌కి 69 పరుగులు జోడించారు..

44 బంతుల్లో 4 ఫోర్లతో 42 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, రీస్ తోప్లే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఓ ఫోర్ బాది 5 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ కూడా రీస్ తోప్లే బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 


61 బంతుల్లో సెంచరీ బాదిన హెన్రీచ్ క్లాసిన్, మార్కో జాన్సెన్‌తో కలిసి ఆరో వికెట్‌కి 151 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు మార్కో జాన్సెన్... 

చేతి వేలికి గాయం కావడంతో ఫీల్డ్ వదిలిన రీస్ తోప్లే, తిరిగి వచ్చిన తర్వాత 2 వికెట్లు తీశాడు. అయితే డేవిడ్ మిల్లర్ అవుటైన తర్వాత తొడ కండరాలు పట్టేయడంతో మరోసారి మైదానం వదిలి వెళ్లాడు రీస్ తోప్లే. 

మళ్లీ ఇంకోసారి ఆఖరి రెండు ఓవర్లు ఉండగా రీస్ తోప్లే తిరిగి క్రీజులోకి వచ్చి.. ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేశాడు.  ఈ ఓవర్‌లో 3 సిక్సర్లు బాదిన మార్కో జాన్సెన్ 26 పరుగులు రాబట్టాడు. ఆరో వికెట్‌కి 77 బంతుల్లో 151 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత హెన్రీచ్ క్లాసిన్ వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. 67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్,  గుస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...  

గెరాల్డ్ 3 పరుగులు చేసి అవుట్ కాగా 42 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసిన మార్కో జాన్సెన్, వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios