Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: అజ్మతుల్లా ఓమర్‌జాయ్ సెంచరీ మిస్... సెమీస్ రేసు నుంచి ఆఫ్ఘాన్ అవుట్..

South Africa vs Afghanistan: 50 ఓవర్లలో 244 పరుగులకి ఆలౌట్ అయిన ఆఫ్ఘనిస్తాన్.. అధికారికంగా సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న ఆఫ్ఘాన్.. 

ICC World cup 2023:  Azmatullah Omarzai misses Century, decent target for South Africa CRA
Author
First Published Nov 10, 2023, 6:49 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్, నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. సెమీస్ రేసులో నిలవాలంటే ఆఫ్ఘాన్ కనీసం 450+ చేయాల్సింది. దీంతో ఆఫ్ఘాన్ కూడా సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.. 

రెహ్మనుల్లా గుర్భాజ్ 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయగా ఇబ్రహీం జాద్రాన్ 30 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేశాడు. కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 2 పరుగులు చేసి నిరాశపరచగా రెహ్మత్ షా 46 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు..

ఇక్రమ్ అలికిల్ 12, మహ్మద్ నబీ 2 పరుగులు చేయగా రషీద్ ఖాన్ 14, నూర్ అహ్మద్ 26 పరుగులు చేశాడు. ముజీబ్ 8, నవీన్ ఉల్ హక్ 2 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేశాడు..

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌కి సెంచరీ పూర్తి చేయడానికి 4 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి బంతికి సింగిల్ తీసిన నవీన్ ఉల్ హక్, ఓమర్‌జాయ్‌కి స్ట్రైయిక్ ఇచ్చాడు. రెండో బంతికి సింగిల్ రాగా, మూడో బంతికి కూడా సింగిల్ తీసి మళ్లీ ఓమర్‌జాయ్‌కి స్ట్రైయిక్ ఇచ్చాడు నవీన్..

ఆఖరి 3 బంతుల్లో అజ్మతుల్లాకి 3 పరుగులు కావాల్సి రాగా రెండు డాట్ బాల్స్‌ రావడంతో చివరి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు ఓమర్‌జాయ్‌. ఇన్నింగ్స్ చివరి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా నవీన్ ఉల్ హక్ రనౌట్ అయ్యాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios