Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: ఫామ్‌లోకి వచ్చిన ఆసీస్ బౌలర్లు... స్వల్ప స్కోరుకే లంక ఆలౌట్...

Australia vs Sri Lanka: 43.3 ఓవర్లలో 209 పరుగులకి ఆలౌట్ అయిన శ్రీలంక... 4 వికెట్లు తీసిన ఆడమ్ జంపా...

ICC World cup 2023:  Australia bowlers controlled Sri Lanka, Adam Zampa picks 4 CRA
Author
First Published Oct 16, 2023, 6:36 PM IST | Last Updated Oct 16, 2023, 6:36 PM IST

125/0 స్కోరుతో ఉన్న శ్రీలంక, 209 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటి రెండు మ్యాచుల్లో విఫలమై, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు ఆడమ్ జంపా 4 వికెట్లు తీసి అదరగొట్టడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన లంక, స్వల్ప స్కోరుకి చాప చుట్టేసింది. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 43.3 ఓవర్లలో 209 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పథుమ్ నిశ్శంక, కుసాల్ పెరేరా కలిసి తొలి వికెట్‌కి 125 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికి పథుమ్ నిశ్శంక వికెట్ కోసం అప్పీలు చేసి, రివ్యూ తీసుకుంది ఆస్ట్రేలియా. అయితే టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ కావడంతో ఆసీస్ ఓ రివ్యూ కోల్పోయింది..

10వ ఓవర్‌లో మరోసారి కుసాల్ పెరేరా వికెట్ కోసం అప్పీలు చేసింది ఆస్ట్రేలియా. అయితే ఈసారి ఆసీస్ డీఆర్‌ఎస్ తీసుకోలేదు. టీవీ రిప్లైలో కుసాల్ పెరేరా అవుట్ అవుతున్నట్టు క్లియర్‌గా కనిపించింది. 67 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

82 బంతుల్లో 12 ఫోర్లతో 78 పరుగులు చేసిన కుసాల్ పెరేరా కూడా ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 9 పరుగులు చేసిన కుసాల్ మెండిస్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.. ఆ తర్వాత 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వని మిచెల్ స్టార్క్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు..

9 బంతుల్లో 2 పరుగులు చేసిన దునిత్ వెల్లలాగే రనౌట్ అయ్యాడు. కరుణరత్నే 2, లాహీరు కుమార 4 పరుగులు చేయగా మహీశ్ తీక్షణ డకౌట్ అయ్యాడు. 39 బంతుల్లో ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన చరిత్ అసలంక, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కి తెరపడింది..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios