Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ 2019: ఓ రోజు ముందుగానే ఆరంభ వేడుకలు

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ సమరం మరికొద్ది గంటల్లో మొదలవనుంది.  ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ సమరంలో గెలుపే లక్ష్యంగా అంతర్జాతీయ జట్లన్ని బరిలోకి దిగుతున్నాయి. దీంతో అభిమానులు దాదాపు నెలన్నర పాటు క్రికెట్ మజాను ఆస్వాదించనున్నారు. రేపు (గురువారం) నుండి ఈ ప్రపంచ కప్ మ్యాచులు ఆరంభంకానుండగా అందుకు ఒకరోజు ముందే అంటే ఇవాళ ఆరంభ వేడుకలు జరగనున్నాయి. 

icc world cup 2019 opening ceremony
Author
London, First Published May 29, 2019, 7:29 PM IST

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ సమరం మరికొద్ది గంటల్లో మొదలవనుంది.  ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ సమరంలో గెలుపే లక్ష్యంగా అంతర్జాతీయ జట్లన్ని బరిలోకి దిగుతున్నాయి. దీంతో అభిమానులు దాదాపు నెలన్నర పాటు క్రికెట్ మజాను ఆస్వాదించనున్నారు. రేపు (గురువారం) నుండి ఈ ప్రపంచ కప్ మ్యాచులు ఆరంభంకానుండగా అందుకు ఒకరోజు ముందే అంటే ఇవాళ ఆరంభ వేడుకలు జరగనున్నాయి. 

ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో ఈ ఆరంభ వేడుకల కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) భారీ ఏర్పాట్లు చేసింది. సెంట్రల్ లండన్ లోని ది మాల్ వేదికగా ఈ  బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.  ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు, భారీ సంఖ్యలో (దాదాపు 4 వేలు) అభిమానులు హాజరుకానున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత కళాకారుల చేత ప్రదర్శనలు, క్రికెట్ కు సంబంధించిన పలు రకాల కార్యక్రమాల అభిమానులను ఆకట్టుకుంటాయని ఐసిసి తెలిపింది. 

ఈ ఆరంభ వేడుకల గురించి ఐసిసి మెన్స్ వరల్డ్ కప్ 2019 మేనేజింగ్ డైరెక్టర్ స్టీవ్ మాట్లాడుతూ... ఈ ఆరంభ వేడుకలు ప్రపంచ కప్ 2019 టోర్నీలో స్పెషల్ స్ధానాన్ని ఆక్రమిస్తాయన్నారు. క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండేలా ఈ వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో పాల్గొనే  అభిమానులకే కాదు టీవీల్లో చూసేవారికి  కూడా ఈ వేడుకలో నిర్వహించే కార్యక్రమాలు ప్రత్యేక అనుభూతి కలిగిస్తాయని స్టీవ్ తెలిపారు.

ఇక ఈ 12వ ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్- దక్షిణాఫ్రికాల మధ్య జరగనుంది. భారత  కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇలా 45 రోజుల పాటు ప్రపంచ కప్ టోర్నీ క్రికెట్ ప్రియులను అలరించనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios