Asianet News Telugu

ప్రపంచ కప్ 2019; ఆరంభంలోనే అదరగొట్టిన ఇంగ్లాండ్...సౌతాఫ్రికా చిత్తుచిత్తు

లండన్ వేదికగా గురువారం జరిగిన ఐసిసి ప్రపంచ క్రికెట్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. 312 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి  దిగిన దక్షిణాఫ్రికా  జట్టు కేవలం 207 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో  ఇంగ్లాండ్ ఆరంభ మ్యాచ్ లోనే 104 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 

ICC world cup 2019: England vs South Africa match live updates
Author
London, First Published May 30, 2019, 3:02 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ సమయం ఎట్టకేలకు ప్రారంభమైంది. ఐసిసి నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీలో  మొదటి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా మరోసారి ఇంగ్లాండ్ తాాము స్వదేశంలో పులులమని మరోసారి నిరూపించుకుంది. బలమైన సఫారీ జట్టుపై ముందు బ్యాటింగ్ ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన ఇంగ్లీష్ జట్టు 104 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇలా ప్రపంచ కప్ ను ఓ అద్భుత విజయంతో ప్రారంభించింది. 

ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుని 311 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెయిన్ స్టో మొదటి ఓవర్లోనే డకౌటైనా ఆ ప్రభావం  ఇంగ్లాండ్ బ్యాటింగ్ పై ఏమాత్రం పడలేదు. మరో  ఓపెనర్ జాసన్ రాయ్ (53 బంతుల్లో 54), రూట్ (59 బంతుల్లో 51), మోర్గాన్ (60 బంతుల్లో 57), బెన్ స్టోక్ (79 బంతుల్లో 89) లు అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. 

అయితే ఈ  లక్ష్యాన్న ఛేదించడానికి  బరిలోకి  దిగిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ఇంగ్లాండ్ కు పోటీ ఇవ్వలేదు. సఫారీ బ్యాట్ మెన్స్ ను ఆరంభ ఓవర్లలోనే ఆర్చర్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఆర్చర్ ఓ పదునైన బౌన్సర్ తో ఆమ్లాను రిటైర్డ్ హట్ గా పెవిలియన్ కు చేరగా కెప్టెన్ డుప్లెసిస్, మార్‌క్రమ్  లు కూడా అతడి బౌలింగ్ లోనే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా దాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. అతడు 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్లంకెట్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత అలీ బౌలింగ్ లో డుమినీ కూడా ఔటయ్యాడు. మరో రెండు పరుగులు మాత్రమే జోడించి ప్రెటోరియస్ కూడా రనౌటయ్యాడు. దీంతో సగం పరుగులకే సఫారీ జట్టు సగం వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత కూడా సఫారీ జట్టు వికెట్ల  పతనం  కొనసాగింది. లోయర్ ఆర్డర్ లో పెహ్లుక్వాయో 24, రబడ 11 పరుగులతో రెండంకెల స్కోరు సాధించారు. మిగతావారంతా కనీస పరుగులు  కూడా సాధించలేకపోయారు.. దీంతో దక్షిణాఫ్రికా 207 పరుగులకే ఆలౌటయ్యింది. ఇలా ఇంగ్లీష్ జట్టు చేతిలో  మొదటి మ్యాచ్ లోనే చిత్తు చిత్తుగా ఓఢింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3, ప్లంకెట్, స్టోక్స్ చెరో రెండు, రషీద్, అలీ  చెరె వికెట్ పడగొట్టి సఫారీలను మట్టికరిపించారు. 

  సఫారీ  బౌలర్లలో ఎంగిడి 3, ఇమ్రాన్ తాహిర్ 2, రబడ 2, పెహ్లుక్వాయో 1  వికట్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా బౌలర్లు విరామం లేకుండా వికెట్లు తీయడంలో విఫలమవడంతో ఇంగ్లాండ్ బ్యాట్ మెన్స్ తలో కొన్ని పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ కు భారీ స్కోరు సాధ్యమయ్యింది. 

 తుది జట్లు: 

ఇంగ్లాండు: ఇయోన్ మోర్గన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), టామ్ కుర్రన్, లియామ్ డాసన్, లియామ్ ప్లంకెట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసోన్ రాయ్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్సే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

దక్షిణాఫ్రికా: ఫాఫ్ డూ ప్లెసిస్ (కెప్టెన్), మార్క్రమ్, క్వింటన్ డీ కాక్ (వికెట్ కీపర్), హషీం ఆమ్లా, రాసీ వాన్ డేర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, అండిలే ఫెహ్లుక్వాయో, జెపి డుమిని, డ్వైన్ ప్రెటోరియస్, డేల్ స్టెయిన్, కాగిసో రబడ, లుంగి నిగిడి, ఇమ్రాన్ తాహిర్, తబ్రైజ్ షాంషీ

Follow Us:
Download App:
  • android
  • ios