మాస్టర్  బ్లాస్టర్ సచిన్ టీమిండియా తరపున ఆడెటపుడు క్రీజులో సీరియస్ గా వుండేవాడు. కానీ మిగతా సమయాల్లో జట్టు సభ్యులతో సరదగా వుంటూ అప్పుడప్పుడు తన హాస్యచతురతను బయటపెట్టేవాడు. అయితే టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియాకు దూరమైనా తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను మాత్రం వదిలిపెట్టలేదు. అలాగే తన సెన్సాఫ్ హ్యూమర్ ను కూడా వదిలిపెట్టలేదు. ఇలా తనలో ఇంకా సరదా సచిన్ దాగున్నాడని  అతడు మరోసారి నిరూపించాడు.

సచిన్ ఇటీవల ముంబైలోని టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీని తన బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీతో కలిసి సందర్శించాడు. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి నెట్స్ లో క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు. కాంబ్లీ బ్యాటింగ్ కు దిగగా సచిన్ అతడికి బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా సచిన్  తన చిన్ననాటి రోజులు గుర్తుకువచ్చాయంటూ ఈ వీడియోను తన ట్విట్టర్ పోస్ట్ చేశాడు.  

ఈ ట్వీట్ పై ఐసిసి కూడా స్పందిస్తూ ఓ సరదా కామెంట్ చేసింది. '' సచిన్ ప్రంట్ పూట్ చూసుకో'' అంటూ అంపైర్ నోబాల్ సిగ్నల్ చూపిస్తున్న ఫోటోను సచిన్ బౌలింగ్ ఫోటోతో కలిపి ట్వీట్ చేసింది. అయితే ఐసిసి ట్వీట్ ను సచిన్ తనదైన సరదా కామెంట్ తో తిప్పికొట్టాడు. 

సచిన్ గతంలో అనేకసార్లు అంపైర్ స్టీవ్ బక్నర్ తప్పుడు నిర్ణయాలకు బలయ్యాడు. ఐసిసి కూడా సచిన్ బౌలింగ్ ను ట్రోల్ చేస్తూ అతడి ఫోటోనే పోస్ట్ చేసింది. దీంతో సచిన్ ''కనీసం ఈసారి నేను బౌలింగ్ చేస్తున్నా..బ్యాటింగ్ కాదు? అంపైర్ డిసిషన్ ఫైనల్ డిసిషన్???'' అంటూ ఐసిసి ట్వీట్ పై సరదాగా స్పందించాడు.  బ్యాటింగ్ చేస్తున్నపుడు చాలాసార్లు ఈ అంపైర్ నిర్ణయాలకు బలయ్యాను...ఇప్పుడు బౌలింగ్ లో కూడా బలవ్వాల్సి వచ్చిందంటూ పరోక్షంగానే కాస్త వ్యంగ్యంగా జవాభిచ్చాడు.